తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Samachar : ఈ నెల 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ, రేపట్నుంచి మే నెల కోటా దర్శన టికెట్లు విడుదల

Tirumala Samachar : ఈ నెల 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ, రేపట్నుంచి మే నెల కోటా దర్శన టికెట్లు విడుదల

22 February 2024, 17:30 IST

google News
    • Tirumala Samachar : తిరుమల శ్రీవారికి ఈ నెల 24 పౌర్ణణి గరుడ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు. మే నెల కోటా దర్శన టోకెన్లను టీటీడీ రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
తిరుమల
తిరుమల

తిరుమల

Tirumala Samachar : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవ‌రి 24న(శ‌నివారం) గరుడసేవ నిర్వహించనున్నారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ(Garuda Seva) నిర్వహిస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల‌ 25న తిరుపతి(Tirupati)లోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో మార్చి 1 నుంచి 10 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో ఆలయం శుద్ది చేస్తారు. ఆలయంతో పాటు పూజా సామాగ్రి శుద్ధి చేస్తారు. అదే రోజు ఉదయం 8 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.

మార్చి 9 నుంచి బ్రహ్మోత్సవాలు

మార్చి 9వ తేదీ నుంచి తొండమాన్‌పురం వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 17 వ‌ర‌కు కొనసాగనున్నాయి. వ‌చ్చే నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, మార్చి 9న ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఆ రోజు రాత్రి వేంకటేశ్వర స్వామి వారు శేష వాహన సేవ ఉంటుంది.

తిరుమల దర్శన టోకెన్లు జారీ

మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల(Tirumala Tickets) తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లు మే నెల ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లు మే నెల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

24న స్పెషల్ దర్శనం టోకెన్లు జారీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు(Special Darshan Tickets) మే నెల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి గదులకు సంబంధించిన కోటాను 24 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. దీంతోపాటు 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ టోకెట్లు మే నెల కోటాను అందుబాటులోకి ఉంచనున్నారు.

తదుపరి వ్యాసం