తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Ht Interview : 'మీరు ఏపీ బాల్ ఠాక్రేనా..?' - కీలక ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ చెప్పిన సమాధానాలివే

Pawan Kalyan HT Interview : 'మీరు ఏపీ బాల్ ఠాక్రేనా..?' - కీలక ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ చెప్పిన సమాధానాలివే

05 October 2024, 12:20 IST

google News
  • తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హిందూవులంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. తాజా ప్రకటనలపై హిందుస్తామ్ టైమ్స్.. పవన్ ను ఇంటర్వూ చేసింది. పలు కీలక ప్రశ్నలకు జవాబులిచ్చారు.

     

ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ (image source janasena party twitter)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్

తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. గతంలో ఉన్న టీటీడీ బోర్డును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు ఎక్కడి వరకైనా వెళ్తానంటూ కామెంట్స్ కూడా చేశారు. తాజాగా తిరుమలలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు.

హిందూ ప్రార్థనా స్థలాలు, మతపరమైన ఆచారాల రక్షణ కోసం రాష్ట్రం, జాతీయ స్థాయిలో బలమైన చట్టాలను అమలు చేయాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. ధర్మం కోసం తాను ప్రతిదీ కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.

తిరుమల లడ్డూ వివాదం, తాజా పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధి దీపికా అమిరపు మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి పలు ప్రశ్నలను సంధించారు. పూర్తి ఇంటర్వూ వివరాలను కింద చూడండి…..

ప్రశ్న : ‘దేవుడిని రాజకీయాల నుంచి తప్పించాలి’ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు?

పవన్ కల్యాణ్ జవాబు : తిరుమల అంశం రాజకీయాలకు సంబంధించినది కాదు. ఇది వేంకటేశ్వరునిపై విశ్వాసం ఉంచిన హిందువుల మనోభావాలను పరిక్షించేది మాత్రమే. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు శతాబ్దాలుగా పాటిస్తున్న ఆగమ సంప్రదాయాలను పెంపొందించడటమే.

  • ప్రశ్న: దేశంలో ఉన్న హిందూవులు ఏకం కావాలని, ధార్మిక సంప్రదాయాలను రక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు కోసం మీ కార్యాచరణ ఏంటి..?

జవాబు : లడ్డూలో ఉపయోగించే కల్తీ పదార్థాలకే ఈ సమస్య పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఏకం కావాలని కోరిన వారిలో నేను కూడా ఉన్నాను. హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిగా… దేశంలోని అనేక క్షేత్రాలలో జరిగే వాస్తవాలను ప్రజలకు అందించాలి. నిర్వహణలోపం గురించి పోరాటం చేసేందుకు నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. హిందూ మతం ఆచరించే వాళ్లు, సంస్థలు అందరూ కలిసి ఆచారాలను గౌరవించేందుకు సమన్వయంగా పని చేయాల్సిన ప్రయత్నం అవసరం. సమిష్టిగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

  • ప్రశ్న: మీరు సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం గురించి మాట్లాడారు. ఆ బోర్డుకు వక్ఫ్ బోర్డు వంటి చట్టబద్ధమైన మరియు న్యాయపరమైన అధికారాలు ఉండబోతున్నాయా..?

జవాబు : నా దృష్టిలో బోర్డుకు మానవ హక్కుల కమిషన్ తరహాలో పాక్షిక న్యాయపరమైన హక్కులు ఉండాలి. ట్రిబ్యునల్‌ను కలిగి ఉన్న బోర్డు ఉండాలి. దేవాలయాలు, భూములు, ఆచార వ్యవహారాలతో పాటు చుట్టు ఉన్న వ్యవస్థలను రక్షించటమే ప్రాథమిక విధిగా పని చేయాలి. హిందువుల పుణ్యక్షేత్రాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి మనోభావాలను దెబ్బతీసే వారిని శిక్షించే అధికారాలు కూడా ఇవ్వాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు (నెయ్యి కల్తీ వంటివి) జరగకుండా ఉండేందుకు సరైన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి.

  • ప్రశ్న: సనాతన రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలనే మీ నిర్ణయంతో మీ NDA భాగస్వాములు ఏకీభవిస్తున్నారా..? జాతీయ స్థాయిలో ఉద్యమంగా మార్చడంలో మీ తదుపరి ప్లాన్ ఏంటి..?

జవాబు : మా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కచ్చితంగా ఈ ఆలోచనతో ఏకీభవిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా… తిరుమల సమస్యపై వెంటనే ఆరా తీశారు. పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే ఇదే విషయంపై ప్రధానమంత్రిని కలుస్తాను. అందరమూ కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాం.

  • ప్రశ్న : ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా బాధ్యత వహించాలి. బోర్డు సభ్యులు జవాబుదారీగా ఉంటారు. ఇప్పుడు పాత బోర్డు రద్దు చేయబడింది. ధార్మిక సంప్రదాయాలపై తగినంత జ్ఞానం ఉన్నవారు మరియు సనాతన ధర్మాన్ని గట్టిగా విశ్వసించే వారు మాత్రమే బోర్డులోని కీలక పదవుల్లో ఉండాలి. లేకుంటే అది ఆగమ సంప్రదాయాల ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది.

  • ప్రశ్న: మీరు ఆంధ్ర ప్రదేశ్ బాలాసాహెబ్ ఠాక్రేనా..?

జవాబు: లేదు, నేను అలా కాదు. నేను నిజమైన లౌకికవాదిని. అంటే అన్ని మతాల మతపరమైన ఆచారాలను రక్షించడంలో మరియు గౌరవించడంలో రాజకీయ పార్టీలు, పౌర సమాజానికి సమాన బాధ్యత ఉంటుంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు లేదా ఇతరులకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే ఖండించబడాలి. మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నా దృష్టిలో ఇదే నిజమైన సెక్యూలరిజం.

  • ప్రశ్న: వారాహి డిక్లరేషన్ ఫలితం ఏమిటి?

జవాబు : సనాతన ధర్మాన్ని బలోపేతం చేసే చట్టాన్ని తీసుకురావడం. మత విశ్వాసాలకు హాని కలిగించే చర్యలను నిరోధించడం. ఈ తరహా చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దేశమంతటా ఒకే విధంగా అమలు చేయాలి.

తదుపరి వ్యాసం