తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

HT Telugu Desk HT Telugu

17 September 2024, 15:58 IST

google News
    • Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(ఎలక్ట్రానిక్ డిప్) డిసెంబర్ కోటా రేపు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల టిక్కెట్ల బుకింగ్ సెప్టెంబ‌ర్ 21న  ప్రారంభం అవుతుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు

Tirumala Arjitha Seva Tickets : డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబ‌ర్ 18 తేదీ ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబ‌ర్ 18 తేదీ ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సెప్టెంబ‌ర్ 20 ఉద‌యం 10 గంట‌ల వరకు తెరిచి ఉంటాయ‌ని పేర్కొంది.

డిసెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం సెప్టెంబ‌ర్ 21 తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్-2024 తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం సెప్టెంబ‌ర్ 23 తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు అందుబాటులో ఉంటాయి.

లక్కీ డిప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

ఈ టిక్కెట్లతో మొదటి గ‌డ‌ప నుంచి శ్రీ‌వారిని ద‌ర్శించుకుని, దాదాపు 30 నిమిషాలు శ్రీ‌వారి సేవ‌లో త‌రించ‌వ‌చ్చు. ఈ సేవ‌ల‌కు త‌క్కువ టికెట్లు ఉండ‌టంతో డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ లేదు. ల‌క్కీడిప్‌లో పాల్గొనాలి. సుప్రభాత సేవకు ప్రతి రోజూ 270 టికెట్లు ఉంటాయి. అర్చన, తోమాల సేవ‌ల‌కు మంగ‌ళ‌, బుధ‌, గురువారాల్లో మాత్రమే రోజుకు ప‌ది టికెట్లు చొప్పున ఉంటాయి. అష్టద‌ళ పాద ప‌ద్మరాధ‌న‌కు కొన్ని మంగ‌ళ‌వారాల్లో మాత్రమే రోజుకు 60 టికెట్లు ఉంటాయి. అందువ‌ల్ల ఈ సేవ‌లకు డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఎల‌క్ట్రానిక్ డిప్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి నెల 18 తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఎల‌క్ట్రానిక్ డిప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. 20వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తీసే ఎల‌క్ట్రానిక్ డిప్‌లో ఎంపిక అయిన వారికి మెసేజ్ వ‌స్తుంది. అప్పుడు 21వ తేదీలోపు న‌గ‌దు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఈ ఎల‌క్ట్రానిక్ డిప్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. తొలుత ఈ లింక్ క్లిక్ చేసిన త‌రువాత టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ సేవా ఎల‌క్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ త‌రువాత టీటీడీ ఇచ్చే సూచ‌న‌లు చ‌దివి, దాని కింద‌న ఉన్న బాక్స్‌లో క్లిక్ చేసి, కంటిన్యూ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ ఐడీ, కంట్రీ, స్టేట్‌, సిటీ, పిన్‌కోడ్ వంటి వాటిని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత నెంబ‌ర్ ఆఫ్ ప‌ర్సన్స్ పై క్లిక్ చేసి ఇద్దరు వ‌ర‌కు సెలక్ట్ చేసుకోవ‌చ్చు. ఆ తరువాత ఇద్దరి పేర్లు, వ‌య‌స్సు, జెండ‌ర్‌, ఫొటో ఐడీ ఫ్రూప్ (ఆధార్, పాస్‌పోర్టు), ఫొటో ఐడీ నెంబ‌ర్ వంటి ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివ‌రాలన్నీ ఎంట‌ర్ చేసిన త‌రువాత‌, కంటిన్యూపై క్లిక్ చేయాలి. సుప్రభాత సేవ, అర్చన, తోమాల, అష్టద‌ళ పాద ప‌ద్మరాధ‌న ఈ నాలుగు సేవ‌ల్లో దేనికి మీరు వెళ్లాలి అనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేయాలి. అక్కడ సేవ‌ల ఫీజు, టైమింగ్స్ అన్ని వివ‌రాలు డిస్‌ప్లే అయి ఉంటాయి.

ఒక్కరికి ఫీజు సుప్రభాత సేవ రూ.120, అర్చన రూ.220, తోమాల రూ.220, అష్టద‌ళ పాద ప‌ద్మరాధ‌న రూ.1,250 ఉంటుంది. మ‌న‌కు న‌చ్చిన సేవ‌పైన క్లిక్ చేసి, ఆ త‌రువాత సెల‌క్ట్ సేవా అండ్ డేట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులు ఏ తేదీని, ఏ సేవా అనేది సెల‌క్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయాలి. అనంత‌రం కంటిన్యూ టూ రివ్యూపై క్లిక్ చేయాలి. దాన్ని ఒక‌సారి చెక్ చేసుకున్న త‌రువాత, కంటిన్యూ అండ్ స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేష‌న్ స‌క్సెస్ అవుతుంది. అక్కడ ఓకే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే, ఎల‌క్ట్రానిక్ డిప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఇంకా ఎంత స‌మ‌యం ఉందో అక్కడ స్పష్టంగా క‌న‌బ‌డుతుంది. ఈ ఎల‌క్ట్రానిక్ డిప్‌లో సెలెక్ట్ అయితే, మొబైల్‌కి మెసేజ్ వ‌స్తుంది.

ఆ త‌రువాత మ‌ళ్లీ ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అందులో బుక్కింగ్ హిస్టరీలోకి వెళ్లి పేమెంట్ చేసుకోవ‌చ్చు. అలాగే అకామిడేష‌న్ విడుద‌ల అయిన‌ప్పుడు బుక్ అకామిడేష‌న్‌ను ఆప్షన్‌పై క్లిక్ చేసి తిరుమ‌ల‌లో రూమ్‌లు కూడా బుక్ చేసుకోవ‌చ్చు. ఇలా తిరుమల‌ శ్రీవారి సుప్రభాత సేవ, అర్చన, తోమాల, అష్టద‌ళ పాద ప‌ద్మరాధ‌న‌ లాంటి ఆర్జిత సేవలకు లక్కీ డిప్‌లో సులువుగా పార్టిషిపేష‌న్ చేయొచ్చు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం