Trains Diversion: మూడు రైళ్లు దారి మళ్లింపు, ఎనిమిది రైళ్లు రీషెడ్యూల్, మరికొన్ని తాత్కలిక రద్దు
17 July 2024, 9:54 IST
- Trains Diversion: విజయవాడ డివిజన్ మీదుగా అప్పికట్ల - నిడుబ్రోలు - సుందూరు స్టేషన్ల మధ్యమూడో లైన్‌ను ప్రారంభించేందుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ / ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
రైళ్లు రద్దు , దారి మళ్లింపు, రీ షెడ్యూల్
Trains Diversion: విజయవాడ డివిజన్ మీదుగా అప్పికట్ల - నిడుబ్రోలు - సుందూరు స్టేషన్ల మధ్యమూడో లైన్‌ను ప్రారంభించేందుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ / ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. అలాగే తిరునెల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
రైళ్ల దారి మళ్లింపు
జులై 22న హౌరాలో బయలుదేరే హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు (22863 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కృష్ణా కెనాల్, గుంటూరు, నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట మీదుగా నడుపబడుతుంది. ఎర్నాకులం- హౌరా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22878) రైలు జులై 22, జులై 29 తేదీల్లో ఎర్నాకులంలో బయలుదేరి రేణిగుంట, యర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు, కృష్ణా కెనాల్ మీదుగా మళ్లించబడుతుంది. సంత్రాగచ్చి- తాంబరం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22841) రైలు జులై 22, జులై 29 తేదీలలో సంత్రగచ్చి నుండి బయలుదేరి కృష్ణా కెనాల్, గుంటూరు, నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, చెన్నై ఎగ్మోర్ మీదుగా మళ్లించబడుతుంది.
రైళ్ల రీషెడ్యూల్
మాల్దా టౌన్ నుండి బయలుదేరే మాల్దా టౌన్-ఎస్ఎంవీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (13434 ) రైలు 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 21న ఉదయం 8:50 గంటలకు బయలు దేరాల్సిన రైలు, 1ః30 గంటల ఆలస్యంగా ఉదయం 10ః20 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది.
హౌరా నుండి బయలుదేరే హౌరా - మైసూర్‌ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్ (22817) రైలు గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 21, జులై 26న ఉదయం 4:10 గంటలకు బయలుదేరాల్సిన రైలు, గంట ఆలస్యంగా ఉదయం 5:40 గంటలకు బయలుదేరుతుంది.
హౌరా నుంచి బయలుదేరే హౌరా-తిరుచిరాపల్లె ఎక్స్‌ప్రెస్ (12663) రైలు 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 18, జులై 21, జులై 25 తేదీల్లో సాయంత్రం 5ః40 గంటలకు బయలుదేరాల్సిన రైలు, 1ః30 గంటల ఆలస్యంగా రాత్రి 7ః10 గంటలకు బయలుదేరుతుంది.
హౌరా నుంచి బయలుదేరే హౌరా-కన్యకుమారి ఎక్స్‌ప్రెస్ (12665) రైలు 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 22న సాయంత్రం 4ః10 గంటలకు, జులై 29న సాయంత్ర 5ః40 గంటలకు బయలుదేరుతుంది.
సిలిఘట్ టౌన్‌లో బయలుదేరే సిలిఘట్ టౌన్ - తాంబరం ఎక్స్‌ప్రెస్ (15630) రైలు 1ః20 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 19న ఉదయం 10ః50కి బయలు దేరాల్సిన రైలు, 1ః20 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12ః10 గంటలకు బయలుదేరుతుంది. అదే రైలు జులై 26న ఉదయం 10ః50 గంటలకు బయలుదేరాల్సిన రైలు, 1ః30 ఆలస్యంగా మధ్యాహ్నం 12ః20 గంటలకు బయలుదేరుతుంది.
న్యూ టిన్సుకియా - తాంబరం ఎక్స్‌ప్రెస్ (15930) రైలు న్యూ టిన్సుకియా నుండి 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. జులై 22న ఉదయం 6ః30 గంటలకు బయలుదేరాల్సిన రైలు, 1ః30 గంటల ఆలస్యంగా ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది.
సంత్రాగచ్చి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (22807) రైలు సంత్రాగచ్చి నుండి 1ః30 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది.జులై 23, జులై 26 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు గంటలకు బయలుదేరాల్సిన రైలు, 1ః30 ఆలస్యంగా రాత్రి 7ః30 గంటలకు బయలుదేరుతుంది.
రైళ్ల నియంత్రణ
ఎస్ఎంవీ బెంగళూరు - హతియా ఎక్స్‌ప్రెస్ (18638) రైలు జులై 30న ఎస్ఎంవీ బెంగళూరు నుండి మధ్యాహ్నం 12ః30 గంటలకు బయలుదేరే మార్గంలో 2ః30 గంటల పాటు నియంత్రణకు గురవుతుంది. ఎస్ఎంవీ బెంగళూరు -న్యూ టిన్సుకియా (22501) రైలు జులై 23, జులై 30 తేదీల్లో ఎస్ఎంవీ బెంగళూరు నుండి మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరే మార్గంలో 2 గంటల పాటు నియంత్రణకు గురవుతుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (22870) రైలు జులై 23న ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే మార్గమధ్యంలో 1ః40 గంటల పాటు నియంత్రణకు గురవుతుంది.
రైళ్లు షార్ట్ టెర్మినేషన్
చెన్నై డివిజన్‌లో సేఫ్టీ పనుల కోసం తాంబరం స్టేషన్‌ను యార్డ్ రీమోడలింగ్ చేయడం వల్ల కొన్ని రైళ్లు షార్ట్ టెర్మినేషన్ చేశారు. జసిదిహ్ నుండి బయలుదేరే జసిదిహ్ - తాంబరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12376) రైలు జులై 27న చెన్నై ఎగ్మోర్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
సంత్రగచ్చి - తాంబరం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22841) రైలు జులై 22, జులై 29 తేదీల్లో సంత్రాగచ్చి నుండి బయలుదేరి చెన్నై బీచ్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. రైలు చెన్నై బీచ్- తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
సిల్‌ఘాట్ టౌన్ - తాంబరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (15630) రైలు జులై 26న సిల్‌ఘాట్ టౌన్ నుండి బయలుదేరి చెన్నై ఎగ్మోర్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. రైలు చెన్నై ఎగ్మోర్-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
న్యూ టిన్సుకియా - తాంబరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (15930) రైలు జులై 22, జులై 29 తేదీల్లో న్యూ టిన్సుకియా నుండి బయలుదేరి చెన్నై ఎగ్మోర్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. రైలు చెన్నై ఎగ్మోర్-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
తాంబరం నుండి బయలుదేరే తాంబరం– జసిదిహ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12375) రైలు జులై 27న తాంబరంకు బదులుగా చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది. రైలు చెన్నై ఎగ్మోర్- తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
తాంబరం నుండి బయలుదేరే తాంబరం - సంత్రాగచ్చి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22842) రైలు జులై 24, జులై 31 తేదీల్లో తాంబరంకు బదులుగా చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది.
తాంబరం నుండి బయలుదేరే తాంబరం - సిల్‌ఘాట్ టౌన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (15629) రైలు జులై 29న తాంబరంకు బదులుగా చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది.
తాంబరం నుండి బయలుదేరే తాంబరం-న్యూ టిన్సుకియా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (15929) జులై 25న తాంబరంకు బదులుగా చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు షెడ్యూల్ చేసుకోవాలని, జరిగిన ఈ అసౌకర్యానికి ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తున్నామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
తిరునెల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి తిరునెల్వేలి నుండి షాలిమార్ వరకు ప్రత్యేక రైలును నడపాలని రైల్వే నిర్ణయించిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
తిరునెల్వేలి– షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06087) రైలు తిరునెల్వేలిలో గురువారాలు జులై 18, జులై 25 తేదీల్లో ఉదయం 01:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 04.57 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఉదయం 05:02 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.
తిరుగు షాలిమార్ - తిరునెల్వేలి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06088) రైలు షాలిమార్ నుండి శనివారాలు జులై 20, జులై 27 తేదీల్లో సాయంత్రం 5ః10 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 07.52 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 07:57 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 1ః15 గంటలకు తిరువెల్లి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లో గూడూరు, నెల్లూరు, రాజవదల్కవ్, ఎల్లూరు, ఓ , పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. ఈ రైళ్లుకు స్లీపర్ క్లాస్-2, జనరల్ సెకండ్ క్లాస్-17, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-2 ఉన్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)