HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Express Trains: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు విజయవాడ స్టేషన్‌కు రావు, రామవరప్పాడు నుంచి రాకపోకలు సాగించాలి…

Express trains: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు విజయవాడ స్టేషన్‌కు రావు, రామవరప్పాడు నుంచి రాకపోకలు సాగించాలి…

Sarath chandra.B HT Telugu

08 July 2024, 13:34 IST

    • Express trains: సాంకేతిక కారణాలతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు రాకుండా దారి మళ్లించిన రైళ్లను నగరంలోని రామవరప్పాడు స్టేషన్‌లో ఇకపై  ఆపనున్నారు.  ఆగస్టులో దాదాపు 10రోజుల పాటు హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లిస్తారు. 
వచ్చే నెలలో ఆ రైళ్లు విజయవాడ రావు...
వచ్చే నెలలో ఆ రైళ్లు విజయవాడ రావు...

వచ్చే నెలలో ఆ రైళ్లు విజయవాడ రావు...

Express trains: రైల్వే ఇంటర్‌ లాకింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట-విజయవాడ-విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించారు. దాదాపు 30 ప్యాసింజర్ రైళ్ళను విజయవాడ స్టేషన్‌కు రాకుండా నగర శివార్లలోని బల్బ్‌ లైన్‌ మీదుగా విశాఖ మార్గంలోకి మ‌ళిస్తున్నారు. ఇలా దారి మళ్లించిన రైళ్లలో దాదాపు 30కు పైగా డైలీ ట్రైన్స్‌ ఉన్నాయి. ఈ రైళ్లు ఇప్పటి వరకు విజయవాడ వచ్చి అక్కడి నుంచి విశాఖ పట్నం వైపు ఇంజిన్ దిశ మార్చుకునేవి.

ఇకపై ఈ రైళ్లన్నీ విజయవాడ శివార్లలోని రాయనపాడు మీదుగా విజయవాడ రాజరాజేశ్వరిపేట, అయోధ్య నగర్, మధురానగర్‌, గుణదల మీదుగా రామవరప్పాడు లైన్‌లో ప్రయాణిస్తాయి. రాయనపాడు తర్వాత మధురానగర్‌, గుణదల రైల్వే స్టేషన్లు ఉన్నా ఈ రైళ్లలో ముఖ్యమైన వాటికి రామవరప్పాడు స్టేషన్‌లో ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైల్వే ఇంటర్‌ లాకింగ్, వెస్ట్ బ్లాక్ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్-విశాఖ మార్గంలో ప్రయాణించే రైళ్లు విజయవాడ స్టేషన్‌కు చేరవు. గతంలో ఇవి రాయనపాడు-విజయవాడ-గుణదల మార్గంలో రాకపోకలు సాగించేవి.

ఇలా దారి మళ్లించిన రైళ్లలో సికింద్రాబాద్-విశాఖపట్నం(12740), గాంధీనగర్‌-విశాఖపట్నం(20804), ఓఖా-పూరీ( 20820), నిజాముద్దీన్-విశాఖపట్నం(12804), చత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్(11019), యశ్వంత్‌పూర్‌-టాటా(18112), హైదరాబాద్‌-షాలిమార్(18046), షిర్డినగర్-విశాఖపట్నం(18504), షిర్డినగర్‌-కాకినాడ పోర్ట్(17205), న్యూఢిల్లీ- విశాఖపట్నం( 20806), హైదరాబాద్-విశాఖపట్నం( 12728), విశాఖపట్నం- సికింద్రాబాద్( 12739), విశాఖపట్నం- న్యూఢిల్లీ( 20805), భువనేశ్వర్-చత్రపతి శివాజీ టెర్మినల్ (11020), కాకినాడ పోర్ట్ - షిర్డి సాయినగర్ ( 17206), షాలిమార్- హైదరాబాద్ ( 18045), విశాఖపట్నం- నిజాముద్దీన్ ( 12803), విశాఖపట్నం - షిర్డీ సాయినగర్ ( 18503), టాటా-యశ్వంతపూర్‌ ( 18111), విశాఖపట్నం- హైదరాబాద్ ( 12727), విశాఖపట్నం- గాంధీనగర్‌ (20803), పూరీ - ఓఖా (20819), విశాఖ-లోకమాన్య తిలక్‌( 18519), మచిలీపట్నం - షిర్డీ సాయినగర్ ( 17208), నర్సాపూర్‌ - నాగర్‌సోల్‌ ( 12787) మచిలీపట్నం-బీదర్ (12749), లోకమాన్య తిలక్‌- విశాఖపట్నం 18520, షిర్డీసాయినగర్- మచిలీపట్నం (17207), నాగర్‌సోల్‌ - నర్సాపూర్‌ (12788), బీదర్-మచిలీపట్నం (12759) రైళ్లను ఆగష్టు 2వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో దారి మళ్లిస్తారు.

ఈ రైళ్లు రామవరప్పాడులో ఆగుతాయి…

విజయవాడ రైల్వే స్టేషన్‌కు రాకుండా నగర శివార్ల నుంచి దారి మళ్లించే రైళ్లలో ఎనిమిది రైళ్లకు రామవరప్పాడులో ఆపుతారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

  • ట్రైన్ నంబర్ 18519 లోకమాన్య తిలక్ టెర్మినల్-రామవరప్పాడు-రాయనపాడు వైపు వెళ్లే రైలు రామవర్పాడులో ఆగుతుంది. ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు స్టాపేజీ కల్పించారు.
  • ట్రైన్ నంబర్ 17208 మచిలీపట్నం-షిర్డీ సాయినగర్‌ రైలును కూడా రామవర్పాడులో ఆపుతారు.
  • ట్రైన్ నంబర్ 12787 నర్సాపూర్‌- నాగర్‌సోల్‌ రైలును ఆగష్టు, 3, 5, 8,10తేదీల్లో రామవరప్పాడులో ఆపుతారు.
  • ట్రైన్ నంబర్ 12749 మచిలీపట్నం-బీదర్ రైలును ఆగస్టు 3 నుంచి 11 వరకు రామవరప్పాడులో ఆపుతారు.
  • ట్రైన్‌ నంబర్ 18520 లోకమాన్య తిలక్-విశాఖపట్నం రైలను ఆగస్టు 2 నుంచి 10వరకు రామవరప్పాడులో ఆపుతారు.
  • ట్రైన్ నంబర్ 17207 షిర్డీనగర్‌, మచిలీపట్నం రైలును ఆగస్టు 7న రామవరప్పాడులో ఆపుతారు.
  • ట్రైన్ నంబర్ 12788-నర్సాపూర్ రైలును ఆగస్టు 2, 4, 6,8 తేదీల్లో రామవరప్పాడులో ఆగుతారు.
  • ట్రైన్ నంబర్ 12750- బీదర్ మచిలీపట్నం రైలును ఆగస్టు 2 నుంచి 10వరకు రామవరప్పాడులో ఆపుతారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్