Viral Video: ఏంటి స్వామి ఇదీ.. చోరీకి వచ్చి గుడి కిటికీలో ఇరుక్కుపోయిన దొంగ..
06 April 2022, 11:19 IST
- అమ్మవారి ఆలయంలో చోరీకి యత్నించిన దొంగ కిటికీలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చోరీకి వచ్చి గుడి కిటీలో ఇర్కుపోయి
ఆపరేషన్ టెంపుల్.. టార్గెట్ ఆభరణాలు..! ఈ ఘనకార్యం కోసం ఎన్ని ప్లాన్ లు వేసుకున్నాడో ఈ మహానుభావుడు ... ఎలాగో అలా అనుకున్న ప్లేస్ లో ల్యాండ్ అయ్యాడు. ఉదయం సమయంలో ఆలయంలో భక్తులు ఉంటారు.. ఇక ఇది కరెక్ట్ సమయం కాదని ప్లాన్ బీ వర్కౌట్ చేశాడు. అనుకున్నట్లే అంతా ఒకే.. కానీ చివర్లో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.
ఏం జరిగిందంటే..
జామి ఎలమ్మ గుడి.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జాడుపూడి పరిధి ప్రసిద్ధి చెందినది. మార్చి నెలలో నిర్వహించే జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో ఆలయంలోని ఆభరణాలు, డబ్బుపై ఆశపడ్డాడు కంచిలికి చెందిన పాపారావు. సోమవారం అర్ధరాత్రి తరువాత ఆలయం కిటికీ పగులగొట్టి లోపలకు దిగాడు. పలు వెండి వస్తువులను దొంగిలించాడు.
ఏ మార్గం గుండా ఆలయంలోకి వెళ్లాడో అక్కడ్నుంచే బయటికి వచ్చేందుకు యత్నించాడు పాపారావు. కానీ పాపారావు ప్రయత్నం ఫలించలేదు. కిటికీ చాలా చిన్నదిగా ఉండటంతో మధ్యలో ఇరుక్కపోయాడు. బయటిరాలేక.. లోపలికి వెళ్లలేక నానా తంటాలు పడ్డాడు. ఇంకేముంది అయ్యగారు తెల్లవారుజాము వరకూ అలాగే ఉండాల్సి వచ్చింది. ఇంకేముంది గ్రామస్థులు రానే వచ్చారు. కిటికీలో ఇరుకున్న పాపారావును బయటికి లాగి... పోలీసులకు అప్పగించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన పలు దృశ్యాలను స్థానికులు రికార్డు చేశారు. ఇవీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టాపిక్