తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Assurance: గంటల తరబడి సమీక్షలు ఉండవు.. అధికారులకు చంద్రబాబు భరోసా, పనితీరు నచ్చకపోతే పంపేయడమేనని వార్నింగ్

CBN assurance: గంటల తరబడి సమీక్షలు ఉండవు.. అధికారులకు చంద్రబాబు భరోసా, పనితీరు నచ్చకపోతే పంపేయడమేనని వార్నింగ్

Sarath chandra.B HT Telugu

25 July 2024, 8:12 IST

google News
    • CBN assurance: ఏపీలో ఇకపై గంటల తరబడి సమీక్షలు ఉండవని సీఎం చంద్రబాబు అధికారులకు భరోసా ఇచ్చారు.  అధికారుల పనితీరు  నచ్చకపోతే వారిని మార్చేస్తామని  శాఖాధిపతుల సమీక్షలో సున్నితంగా హెచ్చరించారు. 
శాఖాధిపతులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
శాఖాధిపతులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

శాఖాధిపతులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

CBN assurance: సమస్యల పరిష్కార మార్గాలతోనే అధికారులు ఇకపై తన వద్దకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖాధిపతులకు సూచించారు. ఇకపై సమీక్షలు గంటల తరబడి ఉండవని అధికారులకు భరోసా ఇచ్చారు. ప్రతి సమస్య పరిష్కారం కోసం తన వద్దకు రావడం సరికాదని, పరిష్కారాన్ని కూడా వారే ఆలోచించుకుని తన దగ్గరకు రావాలని సూచించారు. సచివాలయంలో శాఖాధిపతులు, మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో విస్తృత సమావేశం నిర్వహించారు.

గతంలో తాను మాత్రమే పరిగెత్తేవాడినని, ఇకపై మంత్రులు, అధికారులు కూడా సంబంధిత శాఖలను పరుగులు తీయించాలని సూచించారు. 1995నాటి చంద్రబాబును, అప్పటి పాలనను చూస్తారని అధికారులతో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏ కార్యక్రమానికైనా నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రణాళికతో రావాలని చర్చల్లో దానిపై చర్చిస్తూ సమయం వృథా చేయొద్దని తేల్చి చెప్పారు. ఇకపై తనతో సమావేశాలు కూడా గంట వ్యవధికి మించవని అధికారులకు భరోసా ఇచ్చారు.

శాఖల కేటాయింపులో ఎవరు ఎక్కడ సరిపో తారో పరిశీలించిన తర్వాతే వారిని అక్కడ నియమించినట్టు చెప్పారు. అధికారుల బదిలీల్లో విస్తృత కసరత్తు చేసిన తర్వాత పోస్టింగ్స్‌ ఇచ్చినట్టు చెప్పారు. అధికారుల్ని తాను నమ్ముతున్నానని, తనను కూడా నన్ను నమ్మాలని కోరారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు అంతా కలిసి ముందు కెళ్లాలని పిలుపునిచ్చారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తానని, పనిచేయని వారిని గతంలో చూసి చూడనట్టు వదిలేసే వాడిననని ఇకపై అలా ఉండదన్నారు.

అధికారులు ప్రతిపనికి నిబంధనల పేరుతో కొర్రీలు వేయడం తగదని కొన్ని సందర్భాల్లో ప్రజలకు మేలు చేసేందుకు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. ఎన్నికల్లో ఓట్లు వేరు. ప్రజలకు మంచి చేయడం వేరని ప్రతి పనికి రాజకీయ ప్రయోజనం ఉండకపోయినా మంచి చేశామనే తృప్తి ఉంటుందని చెప్పారు. తనను అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్డెక్కడానికి కారణం గతంలో చేసిన మంచిపనులేనన్నారు. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపె ట్టుకుంటారని, ప్రజలు సాయం కోరి వస్తే.. దాన్ని ఎలా గైనా పరిష్కరించేలా అధికారుల ఆలోచనలు ఉండాలన్నారు.

4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఎప్పుడూ లేనన్ని సమస్యలు, భిన్నమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందిని, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోందని నాడు తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన పాలసీల వ‌ల్లే అక్కడ ఈ ఫలితాలు వచ్చాయన్నారు.

విభజనకంటే ఎక్కువ నష్టం 2019 నుంచి ఉన్న వైసీపీ పాలన వల్ల జరిగిందని, కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయని, కేంద్రం కూడా ఇప్పుడు సాయం చేయ‌డానికి ముందుకు వచ్చిందని ఇది మంచి పరిణామం. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు.

అన్ని శాఖల్లో ఉన్న వ్యవస్థలను యాక్టివ్ చేయాలని, అధికారులు కూడా సెన్సిటివ్ గా పనిచేయాలని కేంద్రం ఏఏ శాఖలకుఎంత నిధులు ఇస్తుంది అనేది తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర పథకాలు కూడా ఉపయోగించుకోలేదని, ప్రభుత్వ శాఖలలో సమస్యల పరిష్కారం, నిధుల సమీకరణలపై సమగ్ర కార్యాచరణతోనే తన వద్దకు రావాలని స్పష్టం చేశారు.

ఏడాదిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు తేగలం అనేది చూసి అంత‌మేర కేంద్రం నుంచి తీసుకు వచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, శాంతి భ‌ద్రత‌ల విష‌యంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. రౌడీలను అణిచివేస్తాం. గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఈ విషయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

తదుపరి వ్యాసం