తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case: సుప్రీం కోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురు..బెయిల్ ఉత్తర్వులు కొట్టేసిన సుప్రీం కోర్టు

Viveka Murder Case: సుప్రీం కోర్టులో అవినాష్‌ రెడ్డికి చుక్కెదురు..బెయిల్ ఉత్తర్వులు కొట్టేసిన సుప్రీం కోర్టు

HT Telugu Desk HT Telugu

24 April 2023, 16:01 IST

    • Viveka Murder Case:  మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడపఎంపీ అవినాష్‍రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టి వేసింది.  తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. 
సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు గత వారంలో అవినాష్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌‌ ఉత్తర్వులను రద్దు చేసింది. సిబిఐ అవినాష్‌ను అరెస్ట్ చేయొచ్చనే అనుమానాలపై ఉపశమనం ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

అవినాష్‌కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గంటన్నర పాటు వాదనలు జరిగాయి. అందరి వాదనలు విన్నామని, అఫిడవిట్లు, రిమాండ్ రిపోర్టులను పరిశీలించామని, హైకోర్తు అసాధరణ ఉత్తర్వులు ఇచ్చిందని అభిప్రాయపడుతున్నామని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ ఆదేశాలివ్వడంలో హైకోర్టు పొరపాటు పడిందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‍ను కొట్టివేసింది. అదే సమయంలో సిబిఐ దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐకి లైన్ క్లియర్ అయినట్లైంది. సునీత తరపున న్యాయవాదులు చేసిన వాదనలతో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మరోవైపు అవినాష్ రెడ్డిని రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి సూచించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. CBI అరెస్ట్‌ చేయాలనుకుంటే చాలా కాలం క్రితమే అరెస్ట్ చేసి ఉండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అవినాష్‌ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

గత వారం వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సమయంలోనే ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులను తప్పు పట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పేలవంగా ఉన్నాయన్న సుప్రీం కోర్టు, ఈ వ్యవహారంపై సోమవారం మరోసారి విచారణ చేపడతామని ప్రకటించింది. దీంతో సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న అవినాష్ తరపు న్యాయవాది ఆందోళన నేపథ్యంలో సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సిబిఐ సూచించింది. దీంతో సుప్రీం కోర్టులో జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. సోమవారం భోజన విరామం తర్వాత సునీత పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును సిబిఐ సుప్రీం కోర్టుకు వివరించింది. మరోవైపు సిబిఐ దర్యాప్తుకు అవినాష్ రెడ్డి అడ్డు తగులుతున్న తీరును సునీత తరపు న్యాయవాదులు వివరించారు. ‘‘దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవడం సరికాదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవని ఆరోపించారు.

హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందని, ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉందన్నారు. కానీ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు అవరోధం కల్గించేలా ఉన్నాయని సిద్ధార్థ లూద్రా వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది.

తదుపరి వ్యాసం