తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Cases Verdicts : టీడీపీ శ్రేణుల్లో హైటెన్షన్- రేపే చంద్రబాబు పిటిషన్లపై కీలక తీర్పులు!

Chandrababu Cases Verdicts : టీడీపీ శ్రేణుల్లో హైటెన్షన్- రేపే చంద్రబాబు పిటిషన్లపై కీలక తీర్పులు!

08 October 2023, 15:26 IST

google News
    • Chandrababu Cases Verdicts : టీడీపీతో పాటు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అక్టోబర్ 9 ఎంతో కీలకంగా మారింది. ఏసీపీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై కీలక తీర్పులు రేపు వెలువడనున్నాయి. సోమవారం అయినా చంద్రబాబు బెయిల్ వస్తుందా? అనే చర్చ మొదలైంది.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu Cases Verdicts : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై నెల రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ బెయిల్ రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన పలు కేసుల్లో తీర్పులు రేపటికి(అక్టోబర్ 9) వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం చంద్రబాబు కీలకంగా మారింది. సోమవారం అయినా చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు... సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడలకు చిత్తు అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. బయటకు వస్తే కేసులు పెడుతున్నారని భయం టీడీపీ శ్రేణులు మొదలైందంటున్నారు.

సెప్టెంబర్ 9న అరెస్ట్

నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చింది. కోర్టు చంద్రబాబు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఈ రిమాండ్ పొడిగించారు. దీంతో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబర్ 19 వరకు చంద్రబాబు జైలులోనే ఉండనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులు రోజుకో వినూత్న నిరసనతో ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకుంటుంది. చంద్రబాబు అరెస్టును దేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు ఖండిస్తున్నారు. అయితే కోర్టుల్లో మాత్రం చంద్రబాబుకు ఉపశమనం దొరకడంలేదు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖాలు చేసిన చంద్రబాబు లాయర్లు.. బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని చంద్రబాబు ఏసీబీ, హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఏసీబీ, హైకోర్టుల్లో చంద్రబాబు కేసుల్లో కీలక తీర్పులు వెలువడనున్నాయి.

ఏసీబీ కోర్టులో

స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇరువర్గాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ పిటిషన్లపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు వాదనలు ముగియగా తీర్పు సోమవారానికి రిజర్వ్ చేసింది.

హైకోర్టులో

చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు రేపు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును అక్టోబర్ 9(సోమవారం) వెల్లడిస్తామని ప్రకటించింది. హైకోర్టు తీర్పులపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సుప్రీంకోర్టులో

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు కీలకంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు వేసిన క్వాష్‌ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో సమర్పించిన ఆధారాలను తమకు అందజేయాలని సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 9కు వాయిదా వేసింది. దీంతో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. రేపు వాదనలు పూర్తై తీర్పు వస్తుందా? లేకపోతే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. చంద్రబాబుకు రేపు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతోందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగువ కోర్టుల్లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం