AP NIT Jobs : ఏపీలో నిట్ లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, నెలకు రూ.71 వేల జీతం
15 October 2023, 22:14 IST
- AP NIT Jobs : తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 24 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.
ఏపీ నిట్ లో ఉద్యోగాలు
AP NIT Jobs : ఏపీ నిట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీతో పాటు టీచింగ్ లేదా పరిశోధన అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
24 పోస్టులు
మొత్తం 24 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి. దీంతో పాటు బోధన లేదా పరిశోధన తగిన అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1000 కాగా, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు నెలవారి జీతం రూ.70,900 చెల్లిస్తారు.
చివరి తేదీ నవంబర్ 13
అభ్యర్థులు అక్టోబర్ 16 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 13 చివరి తేదీ కాగా, దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 20వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థలు పూర్తి సమాచారం కోసం https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. అర్హత గల అభ్యర్థులు తమ CV (అర్హతలు, అనుభవాన్ని పేర్కొనాలి) పూరించిన దరఖాస్తు సాఫ్ట్ కాపీని 13 నవంబర్ 2023న లేదా అంతకు ముందు పంపవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ పీడీఎఫ్ ప్రింటవుట్‌తో పాటు అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను నిట్ కు పంపాలి. డాక్యుమెంట్ల కాపీలను ఏపీ నిట్ చిరునామాకు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 20 నవంబర్ 2023కి లేదా అంతకు ముందు పంపాలి.