తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains: రైల్వే అధికారుల కీలక నిర్ణయం.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..

special trains: రైల్వే అధికారుల కీలక నిర్ణయం.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..

15 August 2024, 17:37 IST

google News
    • special trains: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. రైల్వే అధికారులు కీలక నిర్ణయం కీసుకున్నారు. వన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 8 ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నారు.
special trans via duvvada
special trans via duvvada (REUTERS)

special trans via duvvada

అదనపు రద్దీని క్లియర్ చేయడానికి వన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో నాలుగు వన్ వే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా 8 ప్రత్యేక రైళ్ల కొనసాగించనున్నారు. నాలుగు రైళ్లకు అదనపు స్టాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు రైళ్లు షార్ట్ టర్మినేట్ చేశారు.

మదురై నుంచి ముజఫర్‌పూర్‌కు..

మధురై-ముజఫర్‌పూర్‌ వన్‌వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06114) ఆగస్టు 18న ఆదివారం రాత్రి 7.05 గంటలకు మదురై నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 9:40 గంటలకు దువ్వాడ చేరుకుని, 9:45 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 11:10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి రాత్రి 11:20 గంటలకు బయలుదేరి ముజఫర్‌పుర్‌కు బుధవారం తెల్లవారుజామున 2:45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, భ్రమాపూర్, ఖుర్దా రాడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ మీదుగా నడుస్తోంది. ఈ ట్రైన్‌లో స్లీపర్ క్లాస్-08, జనరల్ సెకండ్ క్లాస్-08, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-02 ఉంటాయి.

కొచ్చువేలి నుంచి పాట్నా వరకు..

కొచ్చువేలి-పాట్నా వన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06111) ఆగస్టు 18న ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు కొచ్చువేలి నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 11:05 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ రాత్రి 11:10 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం తెల్లవారుజామున 12:25 గంటలకు చేరుకొని.. తెల్లవారుజామున 12:35 గంటలకు బయలుదేరి, బుధవారం ఉదయం 5:45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం, భ్రమాపూర్, బాలుగావ్, ఖుర్దా రావు, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్ మీదుగా నడుస్తుంది. దీంట్లో స్లీపర్-09, జనరల్ సెకండ్ క్లాస్-07, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-02 ఉంటాయి.‌

తిరునెల్వేలి టు పాట్నా..

తిరునెల్వేలి-పాట్నావన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06112) రైలు తిరునెల్వేలి నుంచి ఆగస్టు 17న రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 11:05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. రాత్రి 11:10 గంటలకు బయలుదేరుతుంది. అక్కడ నుంచి విజయనగరం తెల్లవారుజామున 12:25 గంటలకు చేరుకుని, 12:35 గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 5:45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, భ్రమాపూర్, బాలుగావ్, ఖుర్దా రావు, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్‌లో సెకెండ్ ఏసీ 02; తర్డ్ ఏసీ ఏసీ-01, స్లీపర్-09, జనరల్ సెకండ్ క్లాస్-04, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-02 ఉంటాయి.

జీఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి పాట్నా వరకూ..

జీఎంఆర్ చెన్నై సెంట్రల్-పాట్నా వన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06113) రైలు. జీఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఆగస్టు 16 శుక్రవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరుతుంది. ఇది రాత్రి 11:05 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి రాత్రి 11:10 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం తెల్లవారుజామున 12:25 గంటలకు చేరుకుని, తెల్లవారుజామున 12:35 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 5:45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, భ్రమాపూర్, బాలుగావ్, ఖుర్దా రావు, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కె రోడ్, భద్రక్, బాలాస్టాస్‌లో ఆగుతుంది. దీంట్లో స్లీపర్-05, జనరల్ సెకండ్ క్లాస్-11 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-02 ఉంటాయి.

8 ప్రత్యేక రైళ్ల కొనసాగింపు..

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే నిర్ణయించింది. ఎర్నాకులం - పాట్నా - ఎర్నాకులం రిజర్వేషన్ లేని ప్రత్యేక రైలు (06085/06086). ఎర్నాకులం నుండి పాట్నా అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు (06085) ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6 వరకు శుక్రవారాల్లో రాత్రి 11.00 గంటలకు ఎర్నాకులంలో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 11.07 గంటలకు బయలుదేరింది. సోమవారం ఉదయం 3.30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. పాట్నా- ఎర్నాకులం అన్‌రిజర్వ్‌డ్ సమ్మర్ స్పెషల్ (06086) రైలు ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 9 వరకు సోమవారాల్లో రాత్రి 11.45 గంటలకు పాట్నాలో బయలుదేరుతుంది. ఇది బుధవారం తెల్లవారుజామున 1.05 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారుజామున 1.07 గంటలకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది.

కోయంబత్తూరు-బరౌని- కోయంబత్తూరు ప్రత్యేక రైళ్లు..

కోయంబత్తూరు - బరౌని స్పెషల్ (06059) రైలు సెప్టెంబర్ 3 వరకు కోయంబత్తూరులో ఉదయం 11.50 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 10.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.25 గంటలకు విజయనగరం చేరుకుని, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు బయలుదేరుతుంది. మూడో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. బరౌనీ-కోయంబత్తూరు స్పెషల్ (06060) రైలు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6 వరకు శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటలకు బరౌనిలో బయలుదేరుతుంది. ఇది మూడో రోజు తెల్లవారుజామున 1:40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి తెల్లవారుజామున 1:50 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ తెల్లవారుజామున 3.48 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి నాలుగో రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది.

కోయంబత్తూరు - ధన్‌బాద్- కోయంబత్తూరు

కోయంబత్తూరు - ధన్‌బాద్ ప్రత్యేక (06063) రైలు శుక్రవారం ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6 వరకు ఉదయం 11:50 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.48 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 8:30 గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం. 06064 ధన్‌బాద్ జంక్షన్ - కోయంబత్తూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం నాడు 19.08.2024 నుండి 09.09.2024 వరకు 06:00 గంటలకు ధన్‌బాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు 03:48 గంటలకు దువ్వాడ చేరుకుని 04 గంటలకు బయలుదేరుతుంది. బుధవారం 03.45 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది.

తిరునెల్వేలి నుంచి షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు..

తిరునెల్వేలి–షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్.. తిరునల్వేలి నుండి ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 5 వరకు గురువారం మధ్యాహ్నం 1:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 4.57 గంటలకు దువ్వాడ చేరుకుని, ఉదయం 5:02 గంటలకు బయలుదేరి షాలిమార్‌కు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు చేరుకుంటుంది. షాలిమార్ - తిరునెల్వేలి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06088) రైలు ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 7 వరకు శనివారాల్లో సాయంత్రం 5:10 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.52 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 7:57 గంటలకు బయలుదేరి, ఆ మరుసటి రోజు సోమవారం 13:15 గంటలకు తిరునెల్వేలికి చేరుకుంటుంది.

నాలుగు రైళ్లకు అదనపు స్టాప్‌లు..

ప్రజల డిమాండ్, ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే అధికారులు నాలుగు రైళ్లకు అదనపు స్టాపేజ్ చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08583) రైలు ఎలమంచిలి స్టేషన్‌లో రాత్రి 8:10 గంటలకు ఆగుతుంది. తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08584) రైలు ఎలమంచిలి స్టేషన్‌లో ఉదయం 7:38 గంటలకు ఆగుతుంది. అక్కడ నుంచి ఉదయం 7:40 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం-ఎస్ఎంవీ బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08543) రైలు ఎలమంచిలి స్టేషన్‌లో సాయంత్రం 5:00 గంటలకు ఆగుతుంది. అక్కడ నుండి సాయంత్రం 5:02 గంటలకు బయలుదేరుతుంది. ఎస్ఎంవీ బెంగళూరు-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08544) రైలు ఎలమంచిలి స్టేషన్‌లో ఉదయం 10:48 గంటలకు ఆగుతుంది. అక్కడ నుంచి ఉదయం 10:50 గంటలకు బయలుదేరుతుంది.

కేకే లైన్‌లో నాలుగు కోచింగ్ రైళ్లు షార్ట్ టర్మినేట్..

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ స్పెష‌ల్ ప్యాసింజర్ (08551) రైలు దంతెవాడలో ఆగ‌స్టు 21 వ‌ర‌కు షార్ట్ టర్మినేట్ చేయనున్నారు. కిరండూల్-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్ (08552) రైలు ఆగ‌స్టు 22 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514) రైలు దంతెవాడలో ఆగ‌స్టు 21 వ‌ర‌కు షార్ట్ టర్మినేట్ చేయనున్నారు. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు ఆగ‌స్టు 22 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి బయలుదేరుతుంది. ఈ కారణంగా ఆగ‌స్టు 22 వ‌ర‌కు కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్ర‌యాణాలు చేసుకోవాలని అధికారులు సూచించారు. పుండి-నౌపడ సెక్షన్‌లో భద్రతా పనుల కారణంగా.. రైళ్లు షార్ట్ టర్మినేట్ చేయనున్నారు. ఆగస్టు 18న విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-బ్రహ్మాపూర్ (08532) రైలు శ్రీకాకుళం రోడ్‌లో షార్ట్ టర్మినేట్ చేయనున్నారు.

రిపోర్టర్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం