తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: నేడు ఏపీలో 56మండలాల్లో తీవ్ర వడగాలులు, 174 మండలాల్లో వడగాల్పులు, 46 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

AP Weather Update: నేడు ఏపీలో 56మండలాల్లో తీవ్ర వడగాలులు, 174 మండలాల్లో వడగాల్పులు, 46 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

Sarath chandra.B HT Telugu

26 April 2024, 6:00 IST

    • AP Weather Update: ఏపీలో ఎండలు  మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నంద్యాల, విజయనగరం జిల్లాల్లో 46 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 
ఏపీలో నేడు 56 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు
ఏపీలో నేడు 56 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు (Photo Source From unsplash.com)

ఏపీలో నేడు 56 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు

AP Weather Update: ఏపీలో వేసవి ఉష్ణోగ్రతలు temparatures క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నంద్యాల జిల్లా Nandyala నందవరంలో 45.6°C, విజయనగరం Vijayanagaram జిల్లా రాజాంలో 45.5°డిగ్రీలు, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1°డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

వైయస్సార్ జిల్లా YSR District ఖాజీపేటలో 44.7°డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 44° డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ SDMA అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్రంలోని 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు.

శుక్రవారం ఏపీలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదు అవుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మరో 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 64 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

శుక్రవారం తీవ్రవడ గాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు…

శ్రీకాకుళం 13 , విజయనగరం 23 , పార్వతీపురంమన్యం 13 , అల్లూరిసీతారామరాజు 2 అనకాపల్లి 3, తూర్పుగోదావరి 1, కాకినాడ ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (174):

శ్రీకాకుళం12 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లిలో 12, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 11, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 18, బాపట్ల 2, ప్రకాశం 8, తిరుపతి 4, నెల్లూరు1, సత్యసాయి 5, మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలని విపత్తుల శాఖ అధికారులు సూచించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

తదుపరి వ్యాసం