99 liquor Brand: రూ.99 మద్యం వచ్చేసింది.. బ్రాండ్ ఇదే.. మిగిలిన బ్రాండ్ల ధరల్లో పెరుగుదల! అదనంగా 2శాతం సెస్ వసూలు..
15 October 2024, 19:37 IST
- 99 liquor Brand: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్ వచ్చేసింది. కూటమి హామీ ఇచ్చినట్టు చౌక మద్యం ఎంట్రీ ఇచ్చేసింది. రూ.99 క్వార్టర్ బ్రాండ్‌గా కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఏపీలో అన్ని బ్రాండ్లపై 2శాతం అదనంగా సెస్ విధిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో విక్రయించే రూ.99 మద్యం బ్రాండ్ ఇదే...
99 liquor Brand: ఏపీలో కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ ఇస్తోంది. మద్యం దుకాణాల వేలం కొలిక్కి రావడంతో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా చౌక మద్యం బ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో మద్యం విక్రయాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. మద్యం ఆదాయం మొత్తం వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించాయి.
మద్యం ధరల్ని నియంత్రిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏపీ మద్యం అక్రమాలపై దర్యాప్తు చేయాలని బీజేపీ అధ్యక్షురాలు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చారు. అక్టోబర్ 14న ప్రైవేట్ మద్యం దుకాణాల లాటరీ కొలిక్కి రావడంతో 16నుంచి విక్రయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రూ.99బ్రాండ్ అదే…
గత ఐదేళ్లుగా మద్యం ధరలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. 2019 జూన్‌కు ముందున్న ధరలతో పోలిస్తే 100శాతానికి పైగా ధరలు పెరిగాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల లభ్యత తగ్గిపోయింది. ఊరుపేరు లేని కొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇచ్చాయి. బ్రాందీ, విస్కీ, బీర్లలో కొత్త కొత్త బ్రాండ్లు విక్రయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ఖాతరు చేయలేదు. 2019 నాటికి రూ.17వేల కోట్లుగా ఉన్న మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయం 2024 నాటికి రూ.30వేల కోట్లకు చేరింది.
ఈ నేపథ్యంలో ప్రజల శ్రమను, కూలీ పనులు చేసి సంపాదించిన సొమ్ములో అధిక భాగంగా మద్యానికి ఖర్చు చేయాల్సి వస్తోందనే విమర్శల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం రూ.99 బ్రాండ్‌ను తీసుకొస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం, కరకంబాడి గ్రామంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీ లేబుల్‌ను అనుమతిస్తూ ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లేబుల్‌పై ఉన్న సమాచారం ప్రకారం 180 ఎంఎల్ క్వార్టర్ 99రుపాయల మద్యంగా పేర్కొన్నారు.
కేరళా మాల్టెడ్ విస్కీను తయారు చేసే ఎస్వీఆర్ కంపెనీ ఆర్వోసీ వివరాల ప్రకారం ఈ సంస్థ 2006 మార్చిలో ఎస్వీఆర్ డిస్టిలరీస్ ఏర్పాటైంది. ఎరగట్టుపల్లి శ్రీనివాసులు రెడ్డి, పుచ్చలపల్లి సాగర్, రోహిణ్ ఎతా, విను వైద్యనాథన్‌లు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రధాన డైరెక్టర్‌గా ఉన్న ఎరగట్టుపల్లి శ్రీనివాసులు రెడ్డి పారామౌంట్ గ్రానైట్స్, ఎస్వీఆర్ బేవరేజీస్, ఎస్వీఆర్ డిస్టిలరీస్, వికి హౌసింగ్ డెవలపర్స్, శాట్ టెల్ కమ్యూనికేషన్స్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు.
మిగిలిన బ్రాండ్ల ధరలపై అస్పష్టత..
ప్రస్తుతం ఏపీలో మద్యం కంటే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే వనరు ఏది ఖజనాకు లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.36వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మద్యం విక్రయాలతో సమకూరింది. అందులో డిస్టిలరీలకు చెల్లింపులు పోగా రూ.30వేల కోట్ల ఆదాయం మిగిలింది ఈ నేపథ్యంలో మద్యం ధరలు తగ్గకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడానికి మద్యం ధరలు ప్రధాన పాత్ర పోషించాయి.
2019 జూన్‌లో లో రూ.120 ఉన్న ఐఎంఎఫ్‌ఎల్ పాపులర్ బ్రాండ్ల ధరలు 2024 నాటికి దాదాపు రెట్టింపు అయ్యాయి. మధ్యలో ధరల్ని కొంత మేరకు తగ్గించినా 2019 జూన్ ధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, డిబిటి పథకాలతో నగదు ఖాతాల్లో వేసినా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగాన్ని ప్రభుత్వమే మద్యం రూపంలో తీసేసుకుంటోందనే ప్రచాం ప్రజల్లో ఎక్కువగా జరిగింది. కూటమి ప్రభుత్వం మద్యం ధరల్ని తగ్గిస్తుందని భావించినా అలా జరగకపోవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మద్య నియంత్రణ భారం తాగేవాళ్లపైనే…
ఏపీలో కొత్తగా అమల్లోకి వచ్చిన లిక్కర్ పాలసీలో మద్యం విక్రయాలపై అదనంగా 2శాతం సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాదక ద్రవ్యాల నియంత్రణ, డి-అడిక్షన్ చర్యలు, పునరావాసం, కౌన్సెలింగ్ మొదలైన వాటి కోసం కేంద్రాలను తెరవడం మరియు నిర్వహించడం వంటి వాటికి నిధులు సమకూర్చడానికి మద్య విక్రయాలపై 2% సెస్ విధించాలని నిర్ణయించార. ప్రతి బాటిల్‌పై ఈ సెస్ వసూలు చేస్తారు.
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్, బీర్ ధరలపై 2% చొప్పున ఈ సెస్ వసూలు చేస్తారు. , వైన్, రెడీ టూ డ్రింక్ ఉత్పత్తులపై కూడా ఇవి వర్తిస్తాయని గెజిట్ జారీ చేశారు. శ