RRB NTPC Recruitment 2024: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్, నేటితో ముగియనున్న అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిజిస్ట్రేషన్
27 October 2024, 18:05 IST
RRB NTPC Recruitment 2024 : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ-2024 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆర్ఆర్బీ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 28, 29 తేదీల్లో ఆన్ లైన్ లో ఫీజు చెల్లించవచ్చు. 11,558 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్, నేటితో ముగియనున్న అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిజిస్ట్రేషన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ(RRB NTPC 2024) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిజిస్ట్రేషన్ నేటితో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ను సందర్శించి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 28 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను ఎడిట్ చేయడానికి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు విండో అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు యాక్టివ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ కలిగి ఉండాలి. బోర్డు నుంచి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు - 11,558
గ్రాడ్యుయేట్ ఖాళీలు : 8,113
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్- 1,736 ఖాళీలు
- స్టేషన్ మాస్టర్ - 994 ఖాళీలు
- గూడ్స్ రైలు మేనేజర్- 3,144 ఖాళీలు
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 1,507 ఖాళీలు
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 732 ఖాళీలు
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు -3,445
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2,022 ఖాళీలు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 361 ఖాళీలు
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 990 ఖాళీలు
- ట్రైన్స్ క్లర్క్ - 72 ఖాళీలు
దరఖాస్తు ఫీజుల వివరాలు
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్ జెండర్, మైనారిటీలు, ఈబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులందరూ రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించారు. ఈ ఫీజులో కొంత భాగం కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే వారికి రీఫండ్ చేస్తారు.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు ఎలా?
- ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ను సందర్శించండి.
- హోమ్ పేజీలో RRB NTPC 2024 Apply లింక్‌పై క్లిక్ చేయండి.
- మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వివరాలు నమోదు చేయాలి.
- ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ తో నమోదు చేయండి.
- ఎన్టీపీసీ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- సబ్మిట్ చేసి అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేయండి.
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఏకంగా 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై పూర్తిగా వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైతే భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి.
డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 ఖాళీగా ఉన్నాయి. ఇందులో డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ నిత్య సేవలను మెరుగుపరుస్తాయి. ఈ నియామకాల్లో అసిస్టెంట్ మెకానికల్‌లు, శ్రామిక్‌లు వెహికల్స్ సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సిబ్బంది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలు మేనేజ్‌మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు వారు ఆఫీసు పనులను నిర్వహిస్తారు.