తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 7 మంది మృతి…!

Nellore Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 7 మంది మృతి…!

10 February 2024, 11:36 IST

google News
    • Road Accident in Nellore Distrcit: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. కావలిలోని టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందినట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం (PTI)

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం

Nellore Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్‌ ప్లాజా దగ్గర శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో… ఏడు మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

మరో 15 మందికి తీవ్ర గాయపడగా.. వారిని ఆస్పత్రి తలరించారు. ముందు ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టగా.. అదే, సమయంలో ఎదురుగా ప్రైవేట్‌ బస్సు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో….. రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై కావలి డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ… ముసునూరు టోల్‌ప్లాజాపై బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 15 మంది గాయపడ్డారని చెప్పారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.

చిత్తూరు జిల్లా అంగళ్లు పశువుల మార్కెట్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన మరో ప్రమాదం జరిగింది. అడివ్‌లోపల్లి నుంచి అంగలూరు వెళ్లే రోడ్డు మార్గంలో బొలెరో కారు బైపాస్ రోడ్డులోని సాయిబాబా దేవాలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాములుకు చెందిన 10 గొర్రెలు చనిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఇన్ స్పెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ… వాహనం అదుపుతప్పటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.

తదుపరి వ్యాసం