తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Arjitha Seva Tickets: నేడు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

TTD Arjitha Seva Tickets: నేడు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

Sarath chandra.B HT Telugu

18 July 2024, 8:13 IST

google News
    • TTD Arjitha Seva Tickets: నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ నెల కోటాను ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 
నేడు అక్టోబర్ కోటా  ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ
నేడు అక్టోబర్ కోటా ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ (TTD )

నేడు అక్టోబర్ కోటా ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ

TTD Arjitha Seva Tickets: తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా గురువారం ఉదయం విడుదల కానుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తుల తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జూలై 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

అక్టోబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల

జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.

అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్ సమయంలో భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

అక్టోబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు జూలై 18 గురువారం ఉదయం 10గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్‌లు నేటి ఉదయం పది గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు అనుమతిస్తారు.

కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు అక్టోబర్-2024కి సంబంధించిన సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22.07.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) ఆగస్టు-2024 టిక్కెట్‌లు జూలై 24 ఉదయం 10గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

తిరుమల స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ కోసం 25వ తేదీ ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. సప్తగౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి ఆగస్టు-2024 టిక్కెట్లు బుకింగ్ కోసం 25వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.

తదుపరి వ్యాసం