AP PGCET WebOptions: రేపటి నుంచి ఏపీ పీజీ సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు, జీవో 77పై కొరవడిన స్పష్టత
06 August 2024, 7:55 IST
- AP PGCET WebOptions: ఆంధ్రప్రదేశ్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ సెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.
రేపటి నుంచి పీజీ సెట్ 2024 వెబ్ ఆప్షన్లు
AP PGCET WebOptions: ఏపీ పీజీసెట్ వెబ్ ఆప్షన్ విండో రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏపీ పీజీ సెట్ 2024 ర్యాంక్ కార్డులు విడుదలయ్యాయి. ర్యాంకులు సాధించిన విద్యార్ధులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఏపీ పీజీ సెట్ 2024 కన్వీనర్ సూచించారు.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీల్లోని క్యాంపస్ కాలేజీలు,అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం పీజీ సెట్ నిర్వహిస్తున్నారు. 2024-25 విద్య సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకు విద్యార్ధులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీ పీజీ సెట్ 2024 ద్వారా ఆంధ్రా యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్శిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన యూనివర్శిటీ, రాయలసీమ యూనివర్శిటీ, విక్రమ సింహపురి యూనివర్శిటీ, ద్రవిడ యూనివర్శిటీ, కృష్ణా యూనివర్శిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ,కర్నూలు క్లస్టర్ యూనివర్శిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్శిటీ, స్విమ్స్ తిరుపతి,జేఎన్ టియూ అనంతపురంలలో అందించే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వ విద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీ సెట్-2024 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా ఏపీ పీజీ సెట్ 2024కు హాజరు కావొచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసిజె, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఇడి, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ కామన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ Online Exam ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. విద్యార్ధులకు ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఏ కాలేజీలో చేరాలనే దానిపై నేటి నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage.aspx# ద్వారా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తాజా అప్డేట్స్ చూడొచ్చు.
ముఖ్యమైన తేదీలు...
పీజీ సెట్ 2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1నుంచి ప్రారంభమైంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 1
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ మే 4వరకు
రూ.500ఆలస్య రుసుముతో మే 15వరకు స్వీకరిస్తారు. రూ. 1000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను జూన్ 10న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
ఎడిట్ ఆప్షన్…
మే 27, 28 తేదీల్లో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్ వెల్లడించారు. మే 31వ తేదీ నుంచి వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు ఏపీపీజీ సెట్-2024 నిర్వహించారు.
పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్ధులు ఐదు దశల్లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎంచుకున్న కోర్సు, దానికి అర్హతలను పరిశీలించాల్సి ఉంటుంది.అర్హతలు నిర్ధారించుకున్న తర్వాత ఫీజు చెల్లించాలి.
రెండో దశలో పరీక్ష ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తైందో లేదో చూసుకోవాలి. మూడో దశలో దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగో దశలో దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. ఐదవ దశలో ఫీజు చెల్లించిన తర్వాత అదనపు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.
జులై 5 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్శిటీల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నేటి నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
జీవో 77పై కొరవడిన స్పష్టత
ఉన్నత విద్యలో ప్రభుత్వ యూనివర్శిటీ కాలేజీల్లో మాత్రమే ఫీజు రియంబర్స్ మెంట్‌ను వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉన్నత విద్యలో అవకాశాలను తగ్గించడానికి ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పీజీ అడ్మిషన్లలో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం అవుతున్నా కొత్త ప్రభుత్వం జీవో 77పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సమయంలో జీవో 77 రద్దు చేస్తామని టీడీపీ నేతలు హామీ లిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా జీవో రద్దుకు సానుకూలంగానే స్పందించినా ఉత్తర్వులను వెలువరించడంలో మాత్రం జాప్యం జరుగుతోంది.