తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Go No 77 Issue: పీజీ అడ్మిషన్ల సమయం, విద్యార్థుల భవిష్యత్తుతో జీవో 77 చెలగాటం, మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు

GO No 77 Issue: పీజీ అడ్మిషన్ల సమయం, విద్యార్థుల భవిష్యత్తుతో జీవో 77 చెలగాటం, మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు

Sarath chandra.B HT Telugu

24 July 2024, 5:00 IST

google News
    • GO No 77 Issue: ఉన్నత విద్యలో పేద విద్యార్ధుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్‌ 77పై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో పేద విద్యార్ధులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. 
పీజీ కోర్సుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ జారీ చేసిన జీవో
పీజీ కోర్సుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ జారీ చేసిన జీవో

పీజీ కోర్సుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ జారీ చేసిన జీవో

GO No 77 Issue: “నా ఎస్సీ, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు” అంటూ తరచుగా ప్రస్తావించే ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికే జారీ చేసిన ఓ జీవో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అయా వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారింది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. 2020 డిసెంబర్ 25వ తేదీన ఈ జీవో జారీ చేశారు. వరుసగా ఐదో ఏడాది కూడా ఈ జీవో పేద, బలహీన వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. జీవోను ఉపసంహరించుకోవాలని విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి వినతులు కూడా అందించాయి.

పేద విద్యార్ధుల అవకాశాలకు గండి…

ఏపీలో 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్‌ మెంట్ పథకాలకు జగనన్నవిద్యా దీవెన, వసతిదీవెన పథకాలుగా పేర్లు మార్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో విద్యా రంగంలో పలు మార్పులు తీసుకు వచ్చారు. వీటిలో ప్రధానంగా పిల్లల్ని బడికి పంపే కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి అమ్మఒడి పేరుతో రూ.15వేలు చెల్లించారు.

పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్దులకు గతంలో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విద్యా దీవెన పేరుతో అమలు చేశారు. మెస్‌ ఛార్జీలను జగనన్న వసతి దీవెన పేరుతో చెల్లించారు. పేదల తలరాతల మార్చేలా విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నా, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. ఏపీలో 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్‌ మెంట్ పథకాలకు జగనన్నవిద్యా దీవెన, వసతిదీవెన పథకాలుగా పేర్లు మార్చారు.

2020 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 77తో ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, పీజీ కోర్సులు, సాంకేతిక కోర్సుల్లో ఫీజుల చెల్లింపు రద్దు చేశారు. ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు అన్ని రకాల పీజీ కోర్సులు, సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు.

కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్ధులకు మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీల్లో చేరినా పథకం వర్తించదని నిబంధన విధించారు. సెల్ఫ్ ఫైనాన్స్‌ కోర్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తింపచేశారు.

ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్లుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రా, ఆదికవి నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఎస్కేయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల వంటి రాష్ట్ర ప్రభుత్వ వర్శిటీల పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీలు, పీజీ కాలేజీలలో మాత్రమే విద్యార్దులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది.

ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో చదువుకునే పీజీ విద్యార్దులకు 2017-18 విద్యా సంవత్సరం నుంచి గత ప్రభుత్వం ఫీజుల చెల్లింపు చేయకపోవడంతో చాలా మంది ఇప్పటికీ కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందని పరిస్థితిలో ఉన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేసే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో బీసీ వర్గాలకు లేని పూర్తి రాయితీలు ఎస్సీ, ఎస్టీలకు ఎందుకని భావించడంతో వాటిని రద్దు చేయాలనే నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రియింబర్స్‌మెంట్‌, మెస్ ఛార్జీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రాయితీ వర్తింపచేయడం అదే సమయంలో బీసీలు ఇతర వర్గాల విద్యార్ధులకు ఆ అవకావం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆ సదుపాయాన్ని రద్దు చేయాలనే గత ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత ప్రభుత్వ ముఖ్యమైన వ్యకి తన ఆదేశాలు అమలు చేయాల్సిందేనని పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్‌మెంట్‌ రద్దు చేయాలని స్పష్టం చేయడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారు.

చేటు చేస్తున్న సంస్కరణలు….

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగంపై దృష్టి సారించి కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలు జరగడంతో వాటిని కట్టడి చేయడం బదులు అసలు పథకాన్ని ఎత్తేయాలని అప్పటి ప్రభుత్వ బాధ్యులకు సూచించినట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తిని కొందరు అధికారులు, సలహాదారులు తప్పు దోవ పట్టించడంతో ప్రైవేట్, ఎయిడెడ్‌ కాలేజీలకు రియింబర్స్‌మెంట్‌ నిలిపివేయాలని నిర్ణయించారు. ఫలితంగా లక్షలాది మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్‌తో చదువు ముగించాల్సి వచ్చింది. హాస్టల్‌ సదుపాయం, స్కాలర్‌షిప్‌ల కోసమే చాలా మంది అడ్మిషన్లు పొందుతున్నారనే అభిప్రాయాన్ని జీవో నంబర్ 77 జారీ చేసే సమయంలో వైసీపీ ముఖ్యనేత భావించడంతో భావనను ముఖ్యమైన వ్యక్తికి కల్పించడంతో జీవోను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జీవోను ఉపసంహరించాలని డిమాండ్…

పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదివే అవకాశాలను దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని కొత్త ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ముఖ్యమంత్రి కార్యాలయ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో అమలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఈ ఏడాది కూడా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

తదుపరి వ్యాసం