తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 2 Results : ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ - ఫలితాల విడుదలపై తాజా అప్డేట్ ఇదే

AP Group 2 Results : ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ - ఫలితాల విడుదలపై తాజా అప్డేట్ ఇదే

31 March 2024, 12:13 IST

google News
    • APPSC Group-2 Prelims 2024 Results Updates: ఏపీ గ్రూప్ 2(AP Group 2) ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించి  కీలక అప్డేట్ అందింది. ఏ క్షణమైనా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 
ఏపీ గ్రూప్ 2
ఏపీ గ్రూప్ 2

ఏపీ గ్రూప్ 2

APPSC Group-2 Prelims 2024 Results Updates: ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా… ఫైనల్ కీ కూడా వచ్చేసింది. అయితే తుది ఫలితాల(APPSC Group-2 Prelims 2024 Results) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రిజల్ట్స్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్(X ఖాతాలో) చేశారు. అతి త్వరలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదలవుతాయని పేర్కొన్నారు. ఇక ఈసారి ఒక్క పోస్టుకు 100 మందిని మెయిన్స్ కు(AP Group 2 Mains) ఎంపిక చేయనున్నారు. గతంలో 50 మందిని మాత్రం…. సెలెక్ట్ చేసేవారు. ఫలితంగా ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ రాసే అవకాశం దొరుకుతుంది. 

ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయిన తర్వాత… ఐదు నంచి 8 వారాల్లో ఫలితాలను ప్రకటిస్తామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇప్పటికే ప్రిలిమ్స్ పత్రాల మూల్యాంకనం పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే మెయిన్స్ పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టనుంది. మెయిన్స్ పరీక్షలను జూలైలో నిర్వహించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Exam) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

AP Group 2 Mains: మెయిన్స్ పరీక్షలు..

గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జూలైలో జరిగే అవకాశం ఉంది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

తదుపరి వ్యాసం