తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Mla Shankar Narayana : మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం, డిటోనేటర్ తో దాడి చేసిన దుండగుడు!

Attack On Mla Shankar Narayana : మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం, డిటోనేటర్ తో దాడి చేసిన దుండగుడు!

08 October 2023, 17:38 IST

google News
    • Attack On Mla Shankar Narayana : మాజీ మంత్రి శంకర్ నారాయణపై మద్యం మత్తులో ఓ వ్యక్తి డిటోనేటర్ తో దాడి చేశాడు. అయితే డిటోనేటర్ కు విద్యుత్ సప్లై లేకపోవడంతో అది పేలలేదు. దీంతో శంకర్ నారాయణకు ప్రమాదం తప్పింది.
మాజీ మంత్రి శంకర్ నారాయణ
మాజీ మంత్రి శంకర్ నారాయణ

మాజీ మంత్రి శంకర్ నారాయణ

Attack On Mla Shankar Narayana : మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకర్ నారాయణ కారుపై పేలుడు పదార్థాలతో దాడికి యత్నించాడు. అయితే అవి పేలకపోవటంతో శంకర్ నారాయణకు పెను ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో శంకర్ నారాయణ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్‌ తన సిబ్బందితో కలిసి కారులో వెళ్తుండగా దుండగుడు డిటోనేటర్ విసిరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే శంకర్ నారాయణపై డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పవర్ సప్లై లేకపోవడంతో ఆ డిటోనేటర్ పేలలేదన్నారు. మద్యం మత్తులో యువకుడు డిటోనేటర్ విసిరినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుడు గణేష్ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానితి చెందినవాడని పోలీసులు గుర్తించారు.

ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి- శంకర్ నారాయణ

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ గోరంట్ల మండల కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేసి, ప్రజాసమస్యలు పరిష్కరించానని శంకర్ నారాయణ తెలిపారు. తనపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదించాలని డిమాండ్ చేశారు. దేవుడి దయతో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని శంకర్ నారాయణ అన్నారు. డిటోనేటర్ పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆరోపించారు.

తదుపరి వ్యాసం