తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Elephant Roams : రైల్వే స్టేషన్ లోకి ఏనుగు ఎంట్రీ, రైలు రాలేదని అలిగి అడవిలోకి!

Elephant Roams : రైల్వే స్టేషన్ లోకి ఏనుగు ఎంట్రీ, రైలు రాలేదని అలిగి అడవిలోకి!

29 October 2023, 19:50 IST

google News
    • Elephant Roams Railway Station : పార్వతీపురం జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ లో ఏనుగు హల్ చల్ చేసింది. అర్ధరాత్రి స్టేషన్ లోకి వచ్చిన గజరాజు కాసేపు స్టేషన్ సిబ్బందిని కంగారు పెట్టి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
రైల్వే స్టేషన్ లో ఏనుగు
రైల్వే స్టేషన్ లో ఏనుగు

రైల్వే స్టేషన్ లో ఏనుగు

Elephant Roams Railway Station : అడవుల్లో ఆహారం, నీటి వసతి కరవుతో వన్య మృగాలు ఊర్లలోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ఈ ఘటనలు చూస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండడంతో... ఏనుగుల సంఖ్య భారీగా ఉంటుంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అడువుల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఏనుగులు తరచూ అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాలపైకి దండెత్తుతుంటాయి. పంటలు నాశనం చేయడంతో పాటు ప్రజలపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.

రైల్వే స్టేషన్ లో ఏనుగు హల్ చల్

పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ఆహారం, నీటి వసతి కోసం గజరాజులు తరచూ సరిహద్దు గ్రామాల్లో వస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగు రైల్వే స్టేషన్‌లోకి వచ్చి హల్ చల్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి ఏనుగు ఆకస్మాత్తుగా వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఏనుగు ప్లాట్ ఫామ్ పైకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని నిమిషాల పాటు ప్లాట్‌ఫామ్‌ తిరిగిన గజరాజు...అనంతరం బయటకు వెళ్లింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రైలు ఎక్కడానికి వచ్చినట్లు ఉందని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అడవుల నరికివేతతో వన్య ప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు రైలు రావడం ఆలస్యమైందని అలిగి అటవీలోకి వెళ్లిపోయిందంటూ చమత్కరించారు.

సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలంలో చిరుత పులి వరుస దాడులకు పాల్పడుతోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడపై దాడి చేసి చంపి తినేసింది. దీంతో గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్థానికంగా ఉండే ఓ రైతు ఎప్పటిలాగే ఆవు దూడను తన పొలం వద్ద కట్టేశాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా ఆవుదూడ పై కళేబరం ఉందని, చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయన్నారు. గత కొన్ని రోజులుగా చిరుత పశువులపై దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను బంధించాలని కోరుతున్నారు.

తదుపరి వ్యాసం