తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mudragada ‍Name Change: ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల

Mudragada ‍Name Change: ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల

Sarath chandra.B HT Telugu

20 June 2024, 10:08 IST

google News
    • Mudragada ‍Name Change:  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే పేరు మార్చుకున్నారు. ఎన్నికల్లో వైసీప ఓడి, పిఠాపురంలో పవన్ గెలిస్తే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో పేరు మార్చుకున్నారు. 
ముద్రగడ పేరును పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్
ముద్రగడ పేరును పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్

ముద్రగడ పేరును పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్

Mudragada ‍Name Change: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సవాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని సవాలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని సవాలు చేశారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో తాను చెప్పిన మాట ప్రకారం పేరు మార్చుకుంటానని స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ముద్రగడ పద్మనాభం మార్చి 27వ తేదీన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరినట్టు ప్రకటించారు. అంతకు ముందు ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్‌ ఓడించేందుకు ముద్రగడకు వైసీపీ బాధ్యతలు అప్పగించింది.ఈ క్రమంలో ముద్రగడ తీరుపై సొంత కుమార్తె సైతం విమర్శలు గుప్పించారు. తన కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో పవన్

ముద్రగడ ఓ దశలో పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. కాపు ఉద్యమనేతగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ముద్రగడ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా కాపుల కోసం పోరాటాలు చేశారు. ఎన్నికల సవాలుతో పేరు మార్చుకోవాల్సి వచ్చింది.

తదుపరి వ్యాసం