Mudragada Comments: వేధించడం కంటే ఒకేసారి చంపేయాలని వేడుకున్న ముద్రగడ పద్మనాభం
21 June 2024, 13:32 IST
- Mudragada Comments: చెప్పిన మాట ప్రకారం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నానని సోషల్ మీడియాలో వేధించడం కంటే ఒకేసారి దాడి చేసి చంపేయాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు.
ముద్రగడ పద్మనాభం
Mudragada Comments: పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్నా తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి తనపై దాడి చేసి చంపేయాలని ముద్రగడ వాపోయారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టు తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నానని ప్రకటించారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదని మందలించి ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేదంటే తన కుటుంబాన్ని జనసైనికులు చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలన్నారు,. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీకి కూడా సూచనలు చేయాలన్నారు.
టాపిక్