తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crime News : కోడలి తల నరికి.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త

Crime News : కోడలి తల నరికి.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త

HT Telugu Desk HT Telugu

11 August 2022, 18:35 IST

google News
    • అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కోడలి తలను ఓ అత్త నరికింది. ఏకంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణమైన ఘటన జరిగింది. కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుందర (35) తల నరికింది. అనంతరనం తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లింది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. కత్తితో తన కోడలి తల నరికింది. ఆ తర్వాత.. వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కవర్లో తల పట్టుకెళ్లి పోలీసుల ముందు పెట్టింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆమె పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో వసుంధరకు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది.

భర్త తరఫున ఆస్తులు.. వసుంధర పేరు మీదకు వచ్చాయి. ఈ ఆస్తులను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి మీదకు మార్చాలని.. వసుంధర చూస్తున్నట్టుగా బయటకు విషయం వచ్చింది. ఈ కారణంగా వసుంధర భర్త తమ్ముడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. వసుంధర చిన్నత్త కూడా చంపేయాలని ప్లాన్ వేసినట్టుగా సమాచారం. ఆమె తల నరికి.. కవర్లో పెట్టారు. సుబ్బమ్మ తల పట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్‌ వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం