తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Roja On Pawan : పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Pawan : పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

27 November 2022, 20:38 IST

google News
    • Roja Comments On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.
మంత్రి రోజా
మంత్రి రోజా

మంత్రి రోజా

జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మంత్రి రోజు కామెంట్స్ చేశారు. పవన్ రోడ్డుపై రౌడీలా రోడ్ షోలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుస్తారన్నారు. పాలిటిక్స్‌(Politics) అంటే ప్రతీరోజు యుద్ధమేనని రోజా చెప్పారు.

'పవన్ సినిమాల్లో(Pawan Movies) హీరో వేషాలు వేస్తూ.. ఇక్కడకు వచ్చి జీరో వేషాలు వేస్తే.. ప్రజలు హీరోను చేయరు. ఇప్పటంలో జరిగిన ఘటనకు కారణం చంద్రబాబు(Chandrababu). లోకేశ్(Lokesh) అక్కడ పోటీ చేసి.. ఓడిపోతే.. అక్కడ ఓ సమస్య వస్తే లోకేశ్ లేదా చంద్రబాబు వెళ్లాలి కదా. పవన్ ను ఎందుకు పంపించారు? పవన్ ను చంద్రబాబు ఫూల్ చేశారు. అలాంటి చంద్రబాబును తిట్టకుండా జగన్ ను నిందిస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే తన ఉనికి కోసమే జగన్‌పై నిందలు వేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు.' అని రోజా అన్నారు.

షూటింగ్‌(Shooting) గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్‌ మీటింగ్‌లు(Weekend Meetings) పెడితే ప్రజలు నమ్మరని రోజా విమర్శించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదని వ్యాఖ్యానించారు. షూటింగ్ గ్యాప్​లో వచ్చి వీకెండ్​లో రెండు గంటలు పీకే డ్రామా చేసి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటం(Ippatam)లోని ప్రజలే పవన్​ను రావొద్దు.. అని ప్లెక్సీలు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటం వివాదంలో హైకోర్టు(High Court) జరిమానా విధించి మెుట్టికాయ వేసిందని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా ఊగిపోతూ పిచ్చి స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు. జనాలు ఎవరూ ఈ విషయాన్ని నమ్మరని రోజా(Roja) అన్నారు.

పవన్ కల్యాణ్ పై మంత్రి పేర్ని నాని(Perni Nani) సైతం విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) మైకు ముందు తన నటనతో అందరినీ అలరిస్తు్న్నారని ఎద్దేవా చేశారు. ఊకదంపుడు ఉపన్యాసంతో హడావుడి చేశారని విమర్శించారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. సీఎం జగన్(CM Jagan)పై విద్వేషం తప్ప ఇంకేమీ లేదన్నారు.

'సమాజం కోసం పవన్‌(Pawan) మాట్లాడింది ఏం లేదు. పవన్ కల్యాణ్ ను నమ్మితే.. కుక్కతోట పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎవరో రాసిన స్క్రిప్ట్ పవన్ చదివి వినిపించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి మరి తొలగించారు. ఇప్పటం(Ippatam)లో ఏం కూలలేదు. అక్కడి వాళ్లే ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటం గ్రామం పరువు తీసింది ఎవరు? కోర్టు మెుట్టికాలయ వేసినా బుద్ధి రాలేదు. పవన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. కోర్టు విధించిన జరిమానా ఎవరు చెల్లించాలి? చంద్రబాబు ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్ కు ఏం కాలేదా?' అని పేర్ని నాని అన్నారు.

తదుపరి వ్యాసం