తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tcs It Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్

TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్

09 October 2024, 20:50 IST

google News
    • TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ కేంద్రం ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నిన్న టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు.
విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్
విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్

విశాఖలో టీసీఎస్ ఐటీ సెంటర్, 10 వేల మందికి ఉద్యోగాలు - మంత్రి లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. నిన్న టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ అయిన మంత్రి లోకేశ్.. బుధవారం బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఎక్స్ లో పోస్టు పెట్టారు. తాజాగా అదేంటో రివీల్ చేశారు. విశాఖ నగరంలో టీసీఎస్‌ ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూపు సిద్ధంగా ఉందని, దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అలాగే ఈవీ, ఏరోస్పేస్‌, టూరిజం, స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే యోచనలో టాటా గ్రూపు ఉందన్నారు. మంగళవారం టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్‌ ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం, ఇతర రంగాల్లో అభివృద్ధిపై లోకేశ్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో విశాఖలో టీసీఎస్‌ ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించినట్లు మంత్రి లోకేశ్ తాజాగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనే నినాదంతో ఏపీకి కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. పెట్టుబడులకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందన్నారు. బిజినెస్‌ చేసేందుకు ఏపీని దేశంలోనే నంబర్‌ 1 స్టేట్ గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విశాఖలో టీసీఎస్‌ సెంటర్ ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించిందన్నారు. ఇదొక కీలక మైలురాయి అన్నారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

"వైజాగ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సెంటర్ అభివృద్ధి చేయడాన్ని నేను సంతోషిస్తున్నాను. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే నినాదంతో కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఏపీని వ్యాపారం చేయడానికి భారతదేశం నంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి మేము కృషి చేస్తున్నందున టీసీఎస్ ఒక ముఖ్యమైన మైలురాయి" - మంత్రి లోకేశ్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వారిని మరోసారి కలిసి... పెట్టుబడులను పెట్టేందుకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందని నమ్మకం కల్పిస్తుంది. వైసీపీ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన లులు సంస్థ ఇటీవలె...ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. సీఎం చంద్రబాబు లులూ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. లులూ గ్రూప్ ప్రతినిధులకు ఏపీ తిరిగి స్వాగతం పలుకుతోందంటూ చంద్రబాబు ట్వీట్ పెట్టారు.

తదుపరి వ్యాసం