తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

Sarath chandra.B HT Telugu

18 July 2024, 7:57 IST

google News
    • AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. 
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు (PTI)

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

AP Weather Update: అల్పపీడన ప్రభావంతో ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వీటి ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల దృష్ట్యా టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 నంబర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

అల్పపీడనంతో పాటు ఆవర్తన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆ జిల్లాలకు అలర్ట్…

గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44.2మిమీ, ఇచ్చాపురంలో 23మిమీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 20.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు…

మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనానికి, అనుబంధంగా విస్తరించి ఉన్న ఆవర్తనం వల్ల నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070,112,18004250101 సంప్రదించాలని అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం