తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lic Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

16 September 2024, 13:20 IST

google News
    • LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీలో వార్షిక ప్రయోజనాలతో పాటు ఒకేసారి అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందవచ్చు. ఏటా రూ.40 వేలు.. పాలసీదారు జీవితాంతం పొందవచ్చు. దీంతో పాటు పాలసీ మెచ్యూరిటీ అనంతరం లక్షల నుంచి కోట్లలో ప్రయోజనం పొందవచ్చు.
ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం
ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

LIC Jeevan Umang : లైఫ్ ఇన్సూరెన్స్ లలో ఎల్ఐసీ చాలా మంచి ప్లాన్ లు అందిస్తోంది. అయితే సరైన సమాచారం లేకపోవడంతో ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. వీటిల్లో ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ ఒకటి. ఈ పాలసీలో రోజుకు సగటున రూ.110 ప్రీమియం చెల్లిస్తే...ఏటా రూ.40,000 పొందే అవకాశం ఉంది. ఇంకాస్త ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకుంటే కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే ప్రతి సంవత్సరం మరింత ఎక్కువ డబ్బు పొందవచ్చు. అయితే 55 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కనీసం 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే ఎల్‌ఐసీకి చెందిన ఈ పథకంలో పెట్టుబడి పెడితే, వారు పెద్దయ్యాక పూర్తి ఆర్థిక స్వాతంత్య్రం పొందవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ బీమా పాలసీలో కనీసం రూ. 2 లక్షల బీమా తీసుకోవాల్సి ఉంటుంది.

జీవన్ ఉమంగ్ పాలసీ వివరాలు

ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను బిడ్డ పుట్టిన వెంటనే... అతని పేరుపై పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తులు ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చు. ఈ బీమా పథకంలో రూ. 2 లక్షలు కనీసం పెట్టుబడి ఉంటుంది. మాగ్జి్మమ్ లిమిట్ లేదు. ఎంత ఎక్కువ మొత్తానికి అయినా బీమా తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవిత బీమా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. దీంతో పాటు ప్లాన్ మెచ్యూరిటీపై ఒకేసారి అధిక మొత్తాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీరు జీవితాంతం(100 ఏళ్లు) ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తాన్ని(బీమా మొత్తంలో 8 శాతం) తిరిగి పొందుతారు. అంటే మీరు 5 లక్షల పాలసీ 15 ఏళ్లకు తీసుకుంటే...16 సంవత్సరం నుంచి ఏటా రూ.40 వేలు తిరిగి ఇస్తారు. ఇలా 100 ఏళ్ల పాటు ఇస్తారు. పాలసీదారు మరణాంతం తర్వాత అతని నామినీకి ఏకమొత్తంలో చెల్లిస్తారు. ఇది ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లాన్ లలో ఒకటి.

ప్రీమియం, బెనిఫిట్స్

ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ బీమా పథకాన్ని మీరు 15 ఏళ్ల వయస్సులో రూ.5 లక్షల బీమా తీసుకుంటే 30 ఏళ్ల వయస్సు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల బీమా తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ. 38,722, నెలకు రూ.3294 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.110 పడుతుంది. మీరు ఆరు నెలల ప్రీమియం పెట్టుకుంటే రూ. 19562 చెల్లించాల్లి ఉంటుంది. ఇందులో నెలవారీ బీమా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కూడా అందుబాటులో ఉంది.

మీకు ఎంత డబ్బు వస్తుందంటే?

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పైన పేర్కొన్న ప్రీమియం చెల్లించిన తర్వాత... ఎల్ఐసీ మీకు 30 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వయస్సు వరకు అంటే 71 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రూ. 40,000 ఇస్తుంది. అంటే 100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల చొప్పున మొత్తం రూ.28 లక్షలకు పైగా వస్తుంది. దీంతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ కలిపితే రూ.1 కోటికి పైగా వచ్చే అవకాశం ఉంది.

జీవన్ ఉమంగ్ పాలసీ ఇతర ప్రయోజనాలు

ఒకవేళ పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే లేదా అంగవైకల్యం చెందితే, అతను టర్మ్ రైడర్‌ను తీసుకోవడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.

తదుపరి వ్యాసం