Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్. కాజీపేట-విజయవాడ మధ్య రెండువారాల పాటు భారీ సంఖ్యలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు
23 December 2024, 16:24 IST
- Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట - విజయవాడ సెక్షన్ల మధ్య మోటమర్రి బ్లాక్‌లో నాన్ ఇంటర్ లింకింగ్ పనుల కోసం భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
విజయవాడ-కాజీపేట సెక్షన్లో డిసెంబర్ 9వరకు భారీగా రైళ్లు రద్దు
Trains Cancellation: రైలు ప్రయాణికులకు పండుగ సీజన్‌లో దక్షిణ మధ్య దక్షిణ మధ్య రైల్వేపెద్ద షాకింగ్ న్యూస్ ప్రకటించింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 9వ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. కాజీపేట డివిజన్ పరిధిలోని కాజీపేట - విజయవాడ సెక్షన్ల మధ్య మోటమర్రి బ్లాక్‌లో నాన్ ఇంటర్ లింకింగ్ పనుల కోసం భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. మొత్తం 26 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. 21 రైళ్లను దారి మళ్లించారు.
రద్దైన రైళ్లు ఇవే..
ట్రైన్ నంబర్ 07755/07756 డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, ట్రైన్ నంబర్ 07279/07278 విజయవాడ-భద్రాచలం-విజయవాడ రైళ్లు డిసెంబర్ 25వ తేదీ నుంచి 2025 జనవరి 9వ తేదీ వరకు రద్దయ్యాయి.
ట్రైన్ నంబర్ 12705/12706 గుంటూరు-సికింద్రబాద్-గుంటూరు డైలీ ట్రైన్ డిసెంబర్ 28, 29, జనవరి 2, 5, 7,8,9 తేదీల్లో రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 12713/12714 విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ డైలీ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 27, జనవరి1, 4, 7, 8,9 తేదీల్లో రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 22646/22645 కొచ్చువెలి-ఇండోర్-కొచ్చువెలి ట్రైన్‌ను డిసెంబర్ 28, జనవరి 4, తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30,జనవరి 6వ తేదీల్లో రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 22648/22647 కొచ్చువెలి-కోబ్రా-కొచ్చువెలి ట్రైన్ సర్వీస్ డిసెంబర్ 26, జనవరి 8 మధ్య రెండువైపులా రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 12511/12512 కొచ్చువెలి-ఘోరక్‌పూర్ రైల్ సర్వీస్‌ను డిసెంబర్ 26 జనవరి 8 మధ్య రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 12521/12522 ఎర్నాకుళం-బరౌనీ-ఎర్నాకుళం రైలును డిసెంబర్ 31 నుంచి జనవరి 10వ తేదీ వరకు రెండు వైపులా రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 01927/01928 కాన్పూర్-మధురై-కాన్పూర్ ట్రైన్ సర్వీస్‌లను డిసెంబర్ 25 నుంచి జనవరి 10వ తేదీ మధ్య కాలంలో రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 02122/02121 జబల్‌పూర్ - మధురై-జబల్‌పూర్ ట్రైన్ సర్వీసును డిసెంబర్ 26, 28తేదీల్లో రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 03325 ధన్‌బాద్- కోయంబత్తూరు-ధన్‌బాద్ - కోయంబత్తూరు రైలు సర్వీసులను డిసెంబర్ 25 జనవరి 4 మధ్య రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 04717/04718 హిసార్-తిరుపతి-హిసార్ ట్రైన్ సర్వీసులను డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ మధ్య రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 06509 బెంగుళూరు-ధనపూర్-బెంగుళూరు ట్రైన్ సర్వీసును డిసెంబర్ 30నుంచి జనవరి 8వ తేదీ మధ్య కాలంలో రద్దు చేశారు.
మొత్తం 26 ట్రైన్ సర్వీసులను రెండు వారాల పాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు ట్రైన్ సర్వీసులను గుంటూరు -కాజీపేట మధ్య రద్దు చేశారు. మరో 21 రైళ్లను వేర్వేరు మార్గాల్లో దారి మళ్లించారు. నాలుగు రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.
దారి మళ్లించిన రైళ్లు, పాక్షికంగా రద్దైన రైళ్ల జాబితా చూడండి…