తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Iiitdm : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్, దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 9 చివరి తేదీ

Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్, దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 9 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu

26 August 2024, 18:57 IST

google News
    •  Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, సైన్సెస్ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) విభాగాల్లో పీహెచ్‌డీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్
కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్

కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్

Kurnool IIITDM : క‌ర్నూలులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం) పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆఖ‌రు తేదీ సెప్టెంబ‌ర్ 9గా నిర్ణయించారు.

విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ స్కీమ్ కింద జులై సెష‌న్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, సైన్సెస్ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) విభాగాల్లో పీహెచ్‌డీ చేసేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అర్హత‌లు

ఇంజినీరింగ్ విభాగాల్లో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్ చేయాలి. అలాగే గేట్ క్లియ‌ర్ చేసి ఉండాలి. అలాగే ఆయా విభాగాల్లో జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులైతే క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సైన్సెస్ విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌, యూజీసీ, సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్‌, నెట్‌, ఎన్‌బీహెచ్ఎంలో అర్హత సాధించి ఉండాలి. అలాగే ఆయా విభాగాల్లో జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులైతే క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, ఓబీసీ కేట‌గిరీ అభ్యర్థుల‌కు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల‌కు రూ.250 ఉంటుంది. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://admissions.iiitk.ac.in/phd2024/?q=howtoapply ను క్లిక్ చేసి అప్లికేష‌న్ దాఖ‌లు చేయొచ్చు. అప్లికేష‌న్ ఫీజును Account Number: 50100257542350, IFSC Code: HDFC0004159, Bank Name: HDFC Bank C Camp Center Branch Kurnool కి చెల్లించాలి.

ఎంపిక విధానం

పీహెచ్‌డీ చేసేందుకు అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల‌కు స్టైఫండ్ కింద మొదటి రెండు సంవ‌త్సరాలు నెల‌కు రూ.38,750 ఇస్తారు. అలాగే మూడు, నాలుగు, ఐదో సంవ‌త్సరాల్లో నెల‌కు రూ.43,750 ఇస్తారు. అలాగే రీసెర్చ్ కాంటిజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 1,20,000 ఇస్తారు. అంత‌ర్జాతీయ కాన్ఫరెన్స్‌ల‌కు వెళ్లేందుకు రూ.1,50,000 ఇస్తారు. హెచ్ఆర్ఏ కింద ఎక్స్ (24 శాతం), వై (16 శాతం), జెడ్ (8 శాతం) న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ఉన్న వారికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తుంది.

జ‌త చేయాల్సిన స‌ర్టిఫికేట్లు

ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, డిగ్రీ స‌ర్టిఫికేట్‌, పీజీ స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, గేట్ స్కోర్ స‌ర్టిఫికేట్ వంటివి జ‌త చేయాలి. దివ్యాంగు అభ్యర్థులు దివ్యాంగు స‌ర్టిఫికేట్ కూడా జ‌త చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు 5 శాతం స‌డ‌లింపు ఉంటుంది. అద‌న‌పు స‌మాచారం, ఇత‌ర వివ‌రాల కోసం ఫోన్ నెంబ‌ర్ 08518-289-121ను, ఈ మెయిల్ phdadmissions@iiitk.ac.inను సంప్రదించ‌వ‌చ్చు.

ఫీజులు వివ‌రాలు

ఫీజులు వివ‌రాలు సెమిస్టర్ వారీగా ఉంటుంది. ఒక సెమిస్టర్‌కు కేట‌గిరీ, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.89,900 ఉంటుంది. అందులో ట్యూష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.30,000, ఇంటర్‌నెట్‌, లైబ్రరీ, కాంటిజెన్సీ ఫీజు, ఎగ్జామినేష‌న్ ఫీజు, మెడిక‌ల్ ఇన్సురెన్సు అండ్ పీహెచ్‌సీ, స్పోర్ట్స్ ఫీజుల‌న్నీ రూ.10,200, వ‌న్ టైమ్ ఫీజు రూ.9,000, హాస్ట‌ల్ ఫీజు రూ. 40,700 ఉంటుంది.

అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు ట్యూష‌న్ ఫీజు మిన‌హాయింపు ఉంటుంది. ఒక సెమిస్టర్‌కు ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.59,900 ఉంటుంది. అందులో ఇంటర్‌నెట్‌, లైబ్రరీ, కాంటిజెన్సీ ఫీజు, ఎగ్జామినేష‌న్ ఫీజు, మెడిక‌ల్ ఇన్సురెన్సు అండ్ పీహెచ్‌సీ, స్పోర్ట్స్ ఫీజుల‌న్నీ రూ.10,200, వ‌న్ టైమ్ ఫీజు రూ.9,000, హాస్టల్ ఫీజు రూ. 40,700 ఉంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం