తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Letter: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్‌ లేఖ, ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం

Ys Jagan letter: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్‌ లేఖ, ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం

Sarath chandra.B HT Telugu

25 June 2024, 13:07 IST

google News
    • Ys Jagan letter: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తీరును తప్పు పట్టారు. 
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్ లేఖ
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్ లేఖ

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు జగన్ లేఖ

Ys Jagan letter: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌కు మాజీ సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి లేఖను రాశారు. గత శుక్రవారం ఏపీ శాసనసభలో సభ్యులు ప్రమాణం జరిగిన తీరును జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం శాసన సభా పద్దతులకు విరుద్ధమన్నారు.

ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు.

పార్లమెంటులో కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదని జగన్ పేర్కొన్నారు. అధికార కూటమితో పాటు స్పీకర్‌ ఇప్పటికే తనపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని జగన్‌ స్పీకర్‌ కు విజ్ఞప్తి చేశారు.

తదుపరి వ్యాసం