Pawan Politics: బీజేపీతో పవన్ దోస్తీ ఉన్నట్టేనా? పెడన ప్రసంగంతో సందేహాలు
05 October 2023, 7:45 IST
- Pawan Politics: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో జనంలో గందరగోళం సృష్టించడం కొత్తేమి కాకపోయినా తాజాగా పెడన సభలో చేసిన వ్యాఖ్యలతో బీజేపీతో దోస్తీ ఉందో లేదోననే కొత్త డౌట్లు రేకెత్తించారు.
టీడీపీతోనే మా ప్రయాణమని తేల్చేసిన పవన్ కళ్యాణ్
Pawan Politics: పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో అప్పుడప్పుడు క్లారిటీ మిస్సవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి అభిమానులతో పాటు సామాన్య జనాన్ని కూడా గందరగోళంలోకి నెట్టేస్తుంటారు. పవన్ తన ప్రసంగాల్లో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారు. వచ్చే ఎన్నికల తర్వాత తానే ముఖ్యమంత్రి అవుతానని ఓసారి, తనకు అంత బలం లేదని ఇంకోసారి, టీడీపి తనకు మద్దతివ్వాలని మరోసారి, తన వల్లే 2014లో టీడీపీ గెలిచిందని ఓసారి, సొంత కులమే తనను ఓడిస్తుందని.. . ఇలా రకరకాల ప్రకటనలతో జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం పవన్‌కు కొత్త కాదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా పెడనలో కొత్త సందేహాలు రేకెత్తించారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని ఇంటికి పంపే సమయం వచ్చిందని, టీడీపీ అనుభవం... జనసేన పోరాట పటిమ కలిస్తే వైసీపీ ఓటమి ఖాయమని ప్రకటించారు. అంతవరకు బాగానే బీజేపీ సంగతి ఆ పార్టీనే తేల్చుకోవాలని తేల్చేశారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తుంది.
వచ్చే ఎన్నికల పోరులో జనసేన, తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. 2014లో శ్రీ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని సంపూర్ణంగా నమ్మి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే బలమైన కాంక్షతోనే మద్దతు ఇచ్చానని చెప్పారు.
విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు బలమైన మంచి భవిష్యత్తు కావాలంటే మోదీ, చంద్రబాబు ఆలోచనలు అవసరమని భావించినట్టు చెప్పారు. దశాబ్ద కాలంలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన గాయం నుంచి కోలుకొని అత్యున్నతంగా ముందుకు వెళుతుందని భావించినా అది జరగలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సమయంలో, ప్రజలంతా అభద్రతలో బతుకుతున్న రోజుల్లో కచ్చితంగా రాష్ట్రాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని భావించి 2021లో ఇచ్చిన పిలుపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు.
రాజకీయాల్లో సహకారం అవసరం….
ప్రస్తుత పరిస్థితుల్లో సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో సహకారం.. సంఘర్షణ ఉంటాయని ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రజల కోసం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని పవన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో జనసేన అండగా నిలబడిందని, ఎన్డీయే కూటమిలో ఉన్నా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకొచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
జనసేన పార్టీ పోరాట పటిమకు తెలుగుదేశం పార్టీ అనుభవ పాఠం కలగలిస్తే కచ్చితంగా జగన్ ను ఓడించడం ఖాయమన్నారు. నిబద్ధతగా రెండు పార్టీలు పనిచేయాలని, ప్రజలను రక్షించేందుకు, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు వచ్చే ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు.
జగన్ అనే వ్యక్తి మళ్లీ రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన అవసరం ఉందని, జగన్ ను ఇంటికి పంపించే సమయం దగ్గరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్న వ్యక్తికి ప్రజలంతా ఓటుతో సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
టీడీపీతో ఎన్నికల ప్రయాణం…
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో మాట్లాడానని దాని కోసం కలిసి వచ్చే పార్టీలతో వెళ్తానని చెప్పానని గుర్తు చేవారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నా మాటకు కట్టుబడి వాళ్లతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తాన్నట్లు స్పష్టం చేశారు. తమతో ఇంకా ఎవరూ కలిసివచ్చినా కలుపుకొని వెళ్తామన్నారు. దీనిపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
పెడనలో పవన్ బీజేపీతో దోస్తీ విషయంలో మరింత స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. టీడీపీతో కలిసి సాగే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా పవన్ ఒత్తిడి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. మరోవైపు జనసేనే-టీడీపీ కూటమికి బీజేపీ దూరం జరిగితే ఆ ప్రభావం కూడా బీజేపీపై ఎంతో కొంత ఉంటుంది.
ఏపీలో సొంతంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగే బలం లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. పవన్ ప్రకటనల ఒత్తిడి ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. మరోవైపు పవన్ ప్రకటనలు బీజేపీ వ్యూహంలో భాగమేననే సందేహాలు కూడా ఉన్నాయి. పవన్‌ను ముందుండి బీజేపీ తెరవెనుక వ్యూహాన్ని అమలు చేస్తుందనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. పొత్తులో భాగంగా టీడీపీపై మానసిక విజయం సాధించడానికే పవన్ వ్యూహాత్మకంగా ఇలా మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఎన్నికల నాటికి జనసేన