తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Simhachalam Tour From Vizag

IRCTC Simhachalam Tour: ‘సింహాచలం’ ట్రిప్.. ఈ ప్యాకేజీలో చూసే ప్రాంతాలివే

HT Telugu Desk HT Telugu

26 January 2023, 18:11 IST

    • IRCTC Simhachalam Tour Latest: సింహాచలం  వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
సింహాచలం
సింహాచలం (facebook)

సింహాచలం

IRCTC Tourism Packages: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇక వీకెండ్‌లో సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. 'వైజాగ్ బ్లిస్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

ఇది రెండు రోజులు ఒక నైట్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 31వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే...

Day 01: విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. రామనాయాడు ఫిల్మ్ స్టూడియో కూడా చూస్తారు. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు. ఫిషింగ్ హార్బర్ లో బోటింగ్ కూడా ఉంటుంది. తిరిగి హోటల్ కు వస్తారు. రాత్రి బోజనం తర్వాత... విశాఖలోనే బస చేస్తారు.

DAY 02: ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు...

సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10510గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 6175, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4730గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

టికెట్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు