తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Announced Visakhapatnam Araku Rail Cum Road Package Tour Here Is Details

IRCTC Araku Tour : అరకు వెళ్లాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

Anand Sai HT Telugu

16 October 2022, 22:19 IST

    • Visakhapatnam Araku IRCTC Tour Package : అరకు అందాలను చూడాలనుకుంటున్నారా? ప్రకృతిలో గడపాలని ఉందా? మీకోసమే ఐఆర్‌సీటీసీ అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC Araku Tour Package Details : అరకు అందాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. కొండల్లో కోనల్లో గడపాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ప్రకటించింది. ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ఉంటుంది. అయితే రైలులో అరకులో ప్రయాణం చేయవచ్చు. అక్టోబర్ 21న ఈ టూర్ అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఉదయం విశాఖపట్నం(visakhapatnam) రైల్వే స్టేషన్ నుంచి టూర్ మెుదలవుతుంది. ఈ రైలు అరకు వ్యాలీకు వెళ్తుంది. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు. అరకు(Araku) అందాలను చూడొచ్చు. ప్రకృతిలో ప్రయాణం ఉంటుంది.

అరకు వ్యాలీ(Araku Valley)కి చేరుకున్న తర్వాత బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్(Tribal Museum and Gardens)ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్(Vizag)కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు తీసుకెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ కంప్లీట్ అవుతుంది.

ఈ ఒక్క రోజు ప్యాకేజీకి వచ్చే రూ.3060 నుంచి రూ.1815 లోపు ధరలు ఉంటాయి. చిన్నారులు, పెద్దలకు వేర్వురుగా ధరలు నిర్ణయించారు. వెళ్లే కోచ్ ను బట్టి కూడా ధరలు మారుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ వెళ్లొచ్చు.