తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

AP Govt Jobs 2024 : ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

10 February 2024, 6:13 IST

google News
    • AP Govt Jobs 2024 Updates:  ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఏపీలోని ప్రభుత్వ శాఖలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు (https://eastgodavari.ap.gov.in/)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు

AP Govt Jobs 2024 Updates: గత కొంతకాలంగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. అయితే జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తున్నాయి ఆయా ప్రభుత్వ శాఖలు. ఇందులో భాగంగా తాజాగా రాజమహేంద్రవరంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనుంది. https://eastgodavari.ap.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.

మొత్తం ఖాళీలు - 13

ఉద్యోగాల పేరు - సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్/ కుక్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్.

అర్హత: డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. పలు పోస్టులకు పని అనుభవం ఉండాలి.

స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వయోపరిమితి- 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్ విధానంలో ఇవ్వాలి.

దరఖాస్తులు ప్రారంభం- ఫిబ్రవరి 7,2024.

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 15,2024.(సాయంత్రం 5 గంటల లోపు)

ఎంపిక విధానం - దరఖాస్తులను పరిశీలించి అర్హతగల వారిని ఇంటర్వూకు పిలుస్తారు.

కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఈ రిక్రూట్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాకు పంపాలి.

అధికారిక వెబ్ సైట్ - https://eastgodavari.ap.gov.in/

అంగన్వాడీ జాబ్స్

AP Anganwadi Recruitment 2024 : విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఉండగా… 37 పోస్టులు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ICDS, విశాఖపట్నం జిల్లా.

ఉద్యోగాలు - అంగన్వాడీ పోస్టులు

మొత్తం ఖాళీలు -39 (అంగన్‌వాడీ వర్కర్ - 2 , అంగన్‌వాడీ హెల్పర్- 37 ఉద్యోగాలు)

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి పేరు - విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.

అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

వయోపరిమితి - 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500 ఇస్తారు. అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళలై ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

పంపాల్సి చిరునామా - విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ - 15-02-2024.(సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది)

గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.

మొత్తం 100 మార్కులకు గాను పారామీటర్స్ తీసుకుంటారు. ఇందులో పది ఉత్తీర్ణతకు 50 మార్కులు, ఇంటర్వూలకు 20 మార్కులు ఉంటాయి.

అధికారిక వెబ్ సైట్ - https://visakhapatnam.ap.gov.in/

తదుపరి వ్యాసం