తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Day 09 : మహిషాసుర మర్థినిగా కనకదుర్గమ్మ

Indrakeeladri Day 09 : మహిషాసుర మర్థినిగా కనకదుర్గమ్మ

B.S.Chandra HT Telugu

04 October 2022, 6:03 IST

google News
    • Indrakeeladri Day 09 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు మహిషాసురమర్థినీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.అష్ట భుజాలతో దుష్టుడైన మ‌హిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.
మహిషాసుర మర్థినీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
మహిషాసుర మర్థినీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

మహిషాసుర మర్థినీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

Indrakeeladri Day 09 దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్థినీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుననారు. ఆశ్వయుజ శుద్ద నవమిని మహార్నవమిగా కూడా భావిస్తారు. చండీసప్తశతిలో మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో, దుష్టరాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకాన్నింటికి మేలు చేసింది. నవమి రోజు రాక్షస సంహరం చేసినందున మహార్నవమిగా వ్యవహరిస్తారు.

మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజసుల్ని బయటకు ప్రసరింపచేస్తారు. ఆ తేజసులన్నీ కలిసి ఓ దివ్య తేజోమూర్తి ఆవిర్భవిస్తుంది. ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా, హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తాడు.

సింహవాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కలుడు,బిడాలుడు వంటి రాక్షసుల్ని అవలీలగా సంహరిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుడిని సంహరిస్తుంది. అదే స్వరూపంతో ఇంద్ర కీలాద్రి మీద వెలిసినట్లు పురాణాలు చెబుతాయి. మహిషాసుర సంహారం తర్వాత ఇంద్ర కీలాద్రిపై అదే స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్థినీ దేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద అలీఢ పద్దతుల్లో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. తలచినంతనే సమస్త భయాలను పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిష మర్థినీ దేవి ఈ విధంగా ధ్యానించాలి,

“ అపర్ణ చండికా చండముండాసుర నిఘాదినీ”

"అయిగిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే

గిరివరవింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే

భగవతిహేశితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే

జయజయహే మహిషాసుర మర్థిని రమ్యకపర్థిని శైలసుతే"

తదుపరి వ్యాసం