తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Iift Kakinada Admissions: ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ బిబిఏ-ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్..

IIFT Kakinada Admissions: ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ బిబిఏ-ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్..

Sarath chandra.B HT Telugu

01 April 2024, 7:39 IST

google News
    • IIFT Kakinada Admissions: దేశంలో ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లలో ఒకటైన  కాకినాడలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది
ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లు
ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లు

ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లు

IIFT Kakinada Admissions: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ కాకినాడ క్యాంపస్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ Admission నోటిఫికేషన్ Notification విడుదలైంది. 2024-29 మధ్య ఐదేళ్ల  5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలన అడ్మిషన్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.

కాకినాడ Kakinadaలోని ఐఐఎఫ్‌టిలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపిఎం), బీబీఏ BBA బిజినెస్ అనలిటిక్స్‌ అండ్‌ ఎంబిఏ MBA- ఇంటర్నేషనల్ బిజినెస్‌ కోర్సుల్లో ప్రవేశాలను అడ్మిషన్ టెస్ట్ ద్వారా కల్పిస్తారు.

దరఖాస్తుదారులు 60శాతం మార్కులతో ఆర్ట్స్‌, కామర్స్, సైన్స్‌ విభాగాల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లకు 55శాతం మార్కులతో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్ధులు త రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2022,2023, 2024 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులకు అర్హులుగా పరిగణిస్తారు. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, బిజినెస్ మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ఒకదానిని తప్పనిసరిగా చదివి ఉండాలి. 2004 జులై 1వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ కోర్సులకు అర్హులుగా పరిగణిస్తారు.

ఐఐఎఫ్‌‌టిలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా విద్యార్ధుల్ని ఎంపిక చేస్తారు. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు ఐఐఎఫ్‌టి కాకినాడ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. https://applyadmission.net/iift2024ipm ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ వ్యాపారంలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కోర్సుల్ని అందించే లక్ష్యంతో ఐఐఎఫ్‌టిను కేంద్రం ఏర్పాటు చేసింది. డీమ్డ్‌ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ వ్యాపారంలో మెళకువల్ని విద్యార్ధులకు నేర్పించడం, విభిన్న సంస్కృతులకు అనుగుణంగా అంతర్జాతీయ వ్యాపారం ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం వంటి విషయాల్లో విద్యార్ధుల్ని నిష్ణాతుల్ని చేసేలా కోర్సుల్ని డిజైన్ చేశారు. స్వదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన కోర్సుల్ని అందించే సంస్థల్లోఐఐఎఫ్‌టి ఒకటి. ఈ సంస్థకు కోల్‌కత్తా,ఢిల్లీలో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 41 యూనివర్శిటీల భాగస్వామ్యంతో కోర్సుల్ని నిర్వమిస్తోంది. పలు ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు కూడా ఉంది. AACSB, EFMD గ్లోబల్, అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, అసోసియేషన్ ఆఫ్ ఎంబిఏస్ వంటి సంస్థల్లో భాగస్వామిగా ఉంది. దేశంలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఐఐఎఫ్‌టి కూడా ఒకటి.

కాకినాడ క్యాంపస్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని అందిస్తున్నారు. జేఎన్‌టియూ కాకినాడ క్యాంపస్‌‌లో మొదట్లో తరగతులు నిర్వహించేవారు. 2022 అక్టోబర్ 28న ఐఐఎఫ్‌టి సొంత క్యాంపస్‌ ప్రారంభించారు.

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బిబిఏ బిజినెస్ అనలిటిక్స్‌ అండ్ ఎంబిఏ కోర్సుల్లో ప్రవేశాలకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సుల్లో మూడేళ్లు పూర్తయ్యాక బిబిఏ డిగ్రీ అందిస్తారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఎంబిఏ అందిస్తారు. మూడేళ్ల డిగ్రీ తర్వాత కూడా కోర్సును ముగించవచ్చు.

మూడేళ్ల డిగ్రీ కోర్సు సెమిస్టర్ విధానంలో ఉంటుంది. ఎంబిఏ కోర్సును ట్రై సెమిస్టర్ విధానంలో ఉంటుంది. బిబిఏ నుంచి ఎంబిఏ కోర్సుకు అర్హత సాధించడానికి నిర్దేశిత లక్ష్యాలను, ప్రమాణాలను విద్యార్ధులు సాధించాల్సి ఉంటుంది. మొత్తం 60సీట్లు అందుబాటులో ఉన్నాయి. వార్షిక ఫీజు రూ.4లక్షలు ఉంటుంది. హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం అందించే పలు రకాల స్కాలర్‌ షిప్‌లను విద్యార్ధులు అందుకోవచ్చు. ఏప్రిల్ 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, ప్రాస్పెక్టస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అర్హతలు, కోర్సు స్ట్రక్చర్‌, ఫీజు వివరాలు, హాస్టల్ సదుపాయలు, ఇతర సందేహాల నివృత్తి సమాచారం అప్లికేషన్‌‌తో పాటు అందుబాటులో ఉంచారు.

తదుపరి వ్యాసం