తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rains In Ap: వానల కోసం తప్పని ఎదురు చూపులు.. ఊరటినిచ్చేలా ఐఎండి ప్రకటన

Rains In AP: వానల కోసం తప్పని ఎదురు చూపులు.. ఊరటినిచ్చేలా ఐఎండి ప్రకటన

HT Telugu Desk HT Telugu

03 July 2023, 5:51 IST

google News
    • Rains In AP: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినా, వర్షాల జాడ మాత్రం కనిపించకపోవడంతో ఏపీలో జనం అల్లాడిపోతున్నారు. జులై వచ్చినా వేడిసెగలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విపత్తుల నివారణ శాఖ మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తీపి కబురు అందించింది. 
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Rains In AP: మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న జనానికి ఊరట నిచ్చేలా రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆంధ‌్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువుల-గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండ రాదని సూచించారు.వర్షాలపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాగల మూడు రోజుల వాతావరణ వివరాలను వెల్లడించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సోమవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

జులై నాలుగో తేదీ మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఐదో తేదీ బుధవారం పార్వతీపురంమన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించారు.

తదుపరి వ్యాసం