తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Si Generousity: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ఎస్సై ఔదార్యం..రోడ్డుపై చెప్పులు కుట్టే వ్యక్తికి బడ్డీ ఏర్పాటు

SI Generousity: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ఎస్సై ఔదార్యం..రోడ్డుపై చెప్పులు కుట్టే వ్యక్తికి బడ్డీ ఏర్పాటు

Sarath chandra.B HT Telugu

30 July 2024, 12:35 IST

google News
    • SI Generousity: రోడ్డు పక్కన వర్షంలో తడుస్తూ చెప్పులు కుట్టే పనిలో ఉన్న వృద్ధుడికి స్థానిక ఎస్సై  చిన్న బడ్డీని ఏర్పాటు చేయడం స్థానికుల హృదయాలను హత్తుకుంది. 
కృష్ణతో ఎస్సై అభిమన్యు
కృష్ణతో ఎస్సై అభిమన్యు

కృష్ణతో ఎస్సై అభిమన్యు

SI Generousity: వర్షంలో తడుస్తూనే రోడ్డు పక్కన చెప్పులు కుడుతున్న వ్యక్తిని చూసి చలించిన పోలీస్ అధికారి చిన్నపాటి దుకాణాన్ని సమకూర్చాడు. దానికి పాదరక్షల ఆస్పత్రిగా నామకరణం చేసి వృద్ధుడికి బహుకరించాడు. ఎస్సై చేసిన మంచిపని స్థానికుల ప్రశంసలు అందుకుంది.

వత్సవాయికి చెందిన ఉప్పర కృష్ణ… వత్సవాయి జెడ్పీ సెంటర్‌లో రోడ్డు వెంబడి నాలుగు తాటాకులు కట్టుకని చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. గత ఆదివారం వర్షంలో తడుస్తూ చెప్పులు కుట్టడం వత్సవాయి ఎస్సై అభిమన్యు గుర్తించారు. జోరువానలో తడిచిపోతూ పనిచేసుకోవడాన్ని చూసి అతని సాయం చేయాలని భావించారు.

తన సిబ్బంది కలిసి అతనికి ఏదైనా గూడు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకయ్యే ఖర్చు భరిస్తానని చెప్పడంతో సిబ్బంది ఐరన్‌ ఫ్రేమ్‌లతో చిన్న షెల్టర్ ఏర్పాటు చేశారు. దానికి పాదరక్షల ఆస్పత్రి అని బోర్డు పెట్టించారు. కృష్ణ పాదరక్షల ఆస్పత్రి అని పేరు పెట్టి వృద్ధుడికి బహుకరించారు. సోమవారం చెప్పులు కుట్టే కృష్ణతో కలిసి దుకాణాన్ని ప్రారంభించారు. ఎస్సై చర్యను స్థానికులు అభినందించారు.

వత్సవాయి గ్రామానికి చెందిన ఉప్పర కృష్ణ జీవనోపాధిలో భాగంగా చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షానికి వర్షపు నీటి వల్ల చెప్పులు కుట్టటానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ అభిమన్య మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి వాన నీరు ఇబ్బంది పెట్టకుండా కృష్ణ చెప్పులు కుట్టడానికి ఎటువంటి ఆటంకం లేకుండా చిన్న షాపు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉప్పర కృష్ణ పడుతున్న ఇబ్బంది చూసి తక్షణమే స్పందించి షాపు ఏర్పాటు చేసినందుకు వత్సవాయి గ్రామస్తులు, మరియు మండల ప్రజలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎస్సై అభిమన్యుకు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న వత్సవాయి పిఎస్‌లో ఎస్సై అభిమన్యు పనిచేస్తున్నారు.

తదుపరి వ్యాసం