తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Right To Education: ఏపీలో 14వేల మందికి ఆర్టీఈ ద్వారా ఉచితంగా ఒకటో తరగతి అడ్మిషన్లు

Right to Education: ఏపీలో 14వేల మందికి ఆర్టీఈ ద్వారా ఉచితంగా ఒకటో తరగతి అడ్మిషన్లు

HT Telugu Desk HT Telugu

29 May 2023, 12:14 IST

google News
    • Right to Education: రైట్ టూ ఎడ్యుకేషన్ పథకం కింద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 14వేల మంది చిన్నారులకు ఉచితంగా ఒకటో తరగతిలో అడ్మిషన్లు కల్పించారు. మే 30వ తేదీలోగా విద్యార్ధులు అడ్మిషన్లు ఖరారు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. 
రైట్ టూ ఎడ్యుకేషన్‌ కింద 14వేల మందికి సీట్ల కేటాయింపు
రైట్ టూ ఎడ్యుకేషన్‌ కింద 14వేల మందికి సీట్ల కేటాయింపు (Sai Saswat Mishra)

రైట్ టూ ఎడ్యుకేషన్‌ కింద 14వేల మందికి సీట్ల కేటాయింపు

Right to Education: ఉచిత విద్య పథకంలో విద్యార్థులు చేరడానికి గడువును పెంచుతున్నట్లు ఏపీ విద్యా శాఖ ప్రకటించింది. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్12(1) (C) ప్రకారం 2023-2024 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సి ఉంది. IB/ICSE/CBSE/State సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలలలో 1 వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు పాఠశాల విద్య కమిషనర్ స్.సురేష్ కుమార్ తెలిపారు.

ఈ నెల 28తోనే ముగిసిన ప్రవేశాలకు విద్యార్థులు సౌకర్యార్థం మరో రెండు రోజులు గడువు పెంచినట్లు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు.

ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్12(1) (C) ప్రకారం 2023-2024 విద్యా సంవత్సరంలో అన్ని రకాల బడుల్లో అడ్మిషన్లు కేటాయించారు. మొదటి విడత ఫేజ్‌1లో అడ్మిషన్ కేటాయించని పిల్లలతో పాటు రెండవ విడతలో దరఖాస్తు చేసుకున్న పిల్లలకు లాటరీ ద్వారా 14192 మంది విద్యార్ధులను ఉచిత నిర్బంధ విద్య పథకానికి ఎంపిక చేశారు.

ఎంపికైన విద్యార్ధుల జాబితా లను, వారికి కేటాయించిన పాఠశాలల వివరాలను జిల్లాల వారీగా జిల్లా విద్యాశాఖాధికారులు మరియు అడిషల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, ఆర్జేడీలకు పంపారు. ఎంపికైన విద్యార్ధుల తల్లి తండ్రులకు, వారికి కేటాయించన పాఠశాలల వివరాలు, ఇతర సమాచారాన్ని తెలియచేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు మరియు అడిషల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష కార్యాలయాల ద్వారా , విద్యార్ధులకు కేటాయించిన పాఠశాలల్లో 28వ తేదీలోగా చేరాలని సూచించారు. ఆ గడువును మరో రెండ్రోజులు పెంచుతూ పాఠశాలవిద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రైట్ టూఎడ్యుకేషన్ కింద అడ్మిషన్లు పొందిన వారు జూన్ 30వ తేదీలోగా వారికి కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్లు పొందాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

తదుపరి వ్యాసం