Pushpa Raj : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పరాజ్ మృతి
28 July 2022, 19:52 IST
- టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ మృతి చెందారు. అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
మాజీమంత్రి పుష్పరాజ్ కన్నూమూత
మాజీమంత్రి పుష్పరాజ్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. వైరస్ బారి నుంచి ఆయన కోలుకున్నారు. కానీ.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ మధ్యకాలంలోనే.. పరిస్థితి కాస్త విషమించింది. దీంతో.. కుటుంబ సభ్యులు పుష్పరాజ్‌నుగుంటూరులో ఓ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కొన్నిరోజులుగా ఆయన చికిత్స పొంతున్నారు. తాజాగా పరిస్థితి విషమించి..కన్నుమూశారు.
టీడీపీతో పుష్పరాజ్ కు ఎంతో అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జీవితం టీడీపీతోనే. 1983, 1985లో తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. 1994లో వామపక్షాలతో పొత్తు కారణంగా టికెట్ దక్కలేదు. 1999లో మళ్లీ టీడీపీ నుంచి తాడికొండో పోటీ చేసి.. గెలుపొందారు. 2004లో ఓటమి పాలయ్యారు. 2017లో ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌గా కూడా పుష్పరాజ్ పని చేశారు.
పుష్పరాజ్ మృతిపై ప్రమఖులు సంతాపం తెలిపారు. మృతిపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గొప్ప నేతను కోల్పోయిందని చెప్పారు. టీడీపీ అధినేత.. చంద్రబాబుపై పుష్పరాజ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయితీతో పుష్పరాజ్ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు.