తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Anil Challenge: తనపై పోటీ చేసి గెలవాలని లోకేష్‌కు మాజీ మంత్రి అనిల్ సవాలు..

YCP Anil Challenge: తనపై పోటీ చేసి గెలవాలని లోకేష్‌కు మాజీ మంత్రి అనిల్ సవాలు..

HT Telugu Desk HT Telugu

05 July 2023, 12:37 IST

google News
    • YCP Anil Challenge: టీడీపీ నేత లోకేశ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. తాను  వెయ్యి కోట్లు సంపాదించానని లోకేశ్ ఆరోపించడంతో,  తండ్రి ఇచ్చిన ఆస్తికన్నా రూపాయి ఎక్కువ వున్నా దేనికైనా సిద్ధమని ప్రకటించారు. తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు.  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

YCP Anil Challenge: టీడీపీ నేత లోకేశ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. తాను వెయ్యి కోట్లు సంపాదించానని లోకేశ్ ఆరోపించడంపై అనిల్ కుమార్ యాదవ్‌ మండిపడ్డారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తికన్నా రూపాయి ఎక్కువ ఉన్నా దేనికైనా సిద్ధమని ప్రకటించారు. తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

అవినీతి ఆరోపణలపై తిరుమలలో ప్రమాణం చేద్దామని లోకేశ్ కు సవాల్ చేశారు. అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, చెప్పిన అరగంటలో వస్తానన్నారు. చర్చలకు సింగిల్ గా వస్తానని, లోకేశ్ వేల మందితో వచ్చినా తనకు సమ్మతమేనన్నారు. సభలో స్టేజి పై నుంచి చర్చకు పిలవడం సరి కాదన్నారు.

చర్చకు వస్తే 2 గంటల వరకు టైం ఇస్తానని చెప్పారు. లోకేష్‌ చేసిన ఆరోపణలపై ప్రమాణాలకు సిద్ధమని, తిరుమల కొండ పై ప్రమాణానికి సిద్దంగా ఉంటానన్నారు. నిజం చెబితే తల పది వేల ముక్కలు అవుతుందని శాపం లోకేష్‌కు ఉందన్నారు. నెల్లూరు జన సమీకరణ కోసం పాదయాత్రకు లోకేష్ ఒక రోజు బ్రేక్ ఇచ్చారన్నారు. సభ పెట్టిన పక్కనే ఉన్న NTR విగ్రహానికి కూడా దండ వేయలేదని విమర్శించారు.

రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే, దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్ ను ఎందుకు పక్కన పెట్టుకున్నారని ప్రశ్నించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 ఏళ్ళు రాజకీయ పార్టీలు తిరిగినా.. టికెట్ ఇవ్వకపోతే.. జగన్ రెండు సార్లు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ 50 లక్షలు ఇంటికి పంపితే.. తిరిగి పంపానని చెప్పారు. లోకేష్ కి దమ్ముంటే తన చాలెంజ్ స్వీకరించాలని.. నెల్లూరు సిటీలో పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లోకేష్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ప్రశ్నించారు.

అభివృద్ది మీద చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే, అర గంటలో వస్తానన్నారు. యుద్దానికి రమ్మని పిలిచినా వస్తానని, లోకేష్ 10 వేల మందిని తెచ్చుకుంటే కేవలం 100 మందితోనే వస్తానన్నారు. లోకేష్‌కు దమ్ముంటే 2024లో నెల్లూరు సిటీలో తన గెలుపును ఆపాలన్నారు.

గంజాయి లో దొరికిన వారంతా టిడిపి నేతలేనని, దొంగతంలా తెలుగు యువత, తెలుగు మహిళలేనని పేపర్ క్లిప్పొంగులను చూపించారు. తనపై ఎలాంటి కేసులు లేవని బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్ళందరూ లోకేష్ పక్కనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

తదుపరి వ్యాసం