AP: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
23 April 2022, 16:53 IST
- పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
అనకాపల్లి జిల్లా పరిధిలోని పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మరోవైపు అగ్నిప్రమాదం దాటికి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అర్పుతున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టాపిక్