తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం

Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం

11 September 2024, 9:09 IST

google News
    • Fatal Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీలో ప్రయాణిస్తున్న కూలీల బతుకులు తెల్లారక ముందే కడతేరిపోయాయి.  లారీ బోల్తా పడటంతో  బస్తాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత  లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. 
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం

Fatal Accident తూర్పు గోదావరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తాడిపళ్ల గ్రామానికి వెళుతున్న మినీలారీ అదుపు తప్పి బోల్తా పడింది. మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమైంది. అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో లారీలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళుతున్నారు. ఆరిపాటి దిబ్బలు-చిన్నాయి గూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో వాహనం అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

బొర్రంపాలెం మండలం నుంచి మంగళవారం రాత్రి జీడిపక్కల లోడుతో తాడిమళ్ళ గ్రామానికి చేరిన వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అరిటాకుదిబ్బలు-చిన్నాయిగూడెం మధ్య వేగంగా ప్రయాణిస్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో లారీ వెనుక జీడి పిక్కల లోడుపై కూర్చున్న కూలీలు బస్తాల కింద ఇరుక్కు పోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. లారీ బోల్తా పడటాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలు ఎనిమిది మంది కూలీలు ఉన్నారు.

కూలీల్లో ఒకరు క్యాబిన్‌లో ఉండగా మిగిలిన ఏడుగురు జీడి బస్తాలపై కూర్చున్నారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే లారీలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఘంటా మధుగా గుర్తించారు.

మృతులను తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, పి.చినముసలయ్య, కత్తవ సత్తిపండు, తాడికృష్ణ, నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికిచెందిన బొక్క ప్రసాద్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని డిఎస్పీ పరిశీలించారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందని వారిని తాడిమళ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

సీఎం సంతాపం…

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సిఎం అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సిఎం ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జీడిపిక్కల లోడ్‍తో లారీ వెళుతుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం అన్నారు.

తదుపరి వ్యాసం