తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains: ఎనిమిది స్పెష‌ల్ రైళ్లు పొడిగింపు, ఆరు రైళ్ల షార్ట్ టెర్మినేష‌న్, మూడు రైళ్లు రీషెడ్యూల్‌...

Special Trains: ఎనిమిది స్పెష‌ల్ రైళ్లు పొడిగింపు, ఆరు రైళ్ల షార్ట్ టెర్మినేష‌న్, మూడు రైళ్లు రీషెడ్యూల్‌...

HT Telugu Desk HT Telugu

12 August 2024, 11:55 IST

google News
    • Special Trains: ప్ర‌జ‌ల డిమాండ్‌, వివిధ సంఘాల నుంచి వ‌చ్చి ప్ర‌తిపాద‌న‌ల నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో ఎనిమిది స్పెష‌ల్ రైళ్ల‌ను పొడిగించారు. అలాగే వివిధ భ‌ద్ర‌త ప‌నులు, అకాల వ‌ర్షాల‌తో ఆరు రైళ్లు షార్ట్ టెర్మినేష‌న్, మూడు రైళ్లు రీషెడ్యూల్‌ చేశారు. 
రైల్వే ప్రయాణికుల‌కు అలర్ట్, ఈస్ట్‌ కోస్ట్ రైల్వే పరిధిలో రైళ్ల రీ షెడ్యూల్
రైల్వే ప్రయాణికుల‌కు అలర్ట్, ఈస్ట్‌ కోస్ట్ రైల్వే పరిధిలో రైళ్ల రీ షెడ్యూల్

రైల్వే ప్రయాణికుల‌కు అలర్ట్, ఈస్ట్‌ కోస్ట్ రైల్వే పరిధిలో రైళ్ల రీ షెడ్యూల్

Special Trains: ప్ర‌జ‌ల డిమాండ్‌, వివిధ సంఘాల నుంచి వ‌చ్చి ప్ర‌తిపాద‌న‌ల నేపథ్యంలో ఎనిమిది స్పెష‌ల్ రైళ్ల‌ను పొడిగించారు. అలాగే వివిధ భ‌ద్ర‌త ప‌నులు, అకాల వ‌ర్షాల‌తో ఆరు రైళ్లు షార్ట్ టెర్మినేష‌న్, మూడు రైళ్లు రీషెడ్యూల్‌, రెండు రైళ్ల‌ రాక‌పోక‌ల వేళ‌లు మార్పు, ఒక రైలు మ‌ళ్లింపు చేసిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.

ప్రజల డిమాండ్, వివిధ సంఘాల నుండి వచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం- ఎస్ఎంవీ బెంగళూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సేవలను పొడిగించాలని నిర్ణయించింది.

విశాఖపట్నం- ఎస్ఎంవీ బెంగుళూరు వీక్లీ పూజ స్పెష‌ల్‌ (08543) రైలును ఆగ‌స్టు 18 నుండి న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు పొడిగించారు. ప్ర‌తి ఆదివారం మ‌ధ్యాహ్నం 3:55 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది.

ఎస్ఎంవీ బెంగళూరు -విశాఖపట్నం వీక్లీ పూజ స్పెషల్ (08544) రైలును ఆగ‌స్టు 19 నుండి న‌వంబ‌ర్ 25 వ‌ర‌కు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగుళూరు నుండి ప్ర‌తి సోమవారాల్లో మ‌ధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, బెంగళూరు మధ్య, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం ఉన్నాయి. కంపోజిషన్: 2వ ఏసీ-1, 3వ ఏసీ-5, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్-5, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-2 ఉన్నాయి.

నాందేడ్ - శ్రీకాకుళం - నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, నాందేడ్ - శ్రీకాకుళం రోడ్ - నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ఒక రోజు నడపాలని రైల్వే నిర్ణయించింది.

నాందేడ్ నుండి బ‌య‌లుదేరే నాందేడ్ - శ్రీకాకుళం రోడ్ స్పెషల్ (07487) రైలు ఆగ‌స్టు 14న మ‌ధ్యాహ్నం 2.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద‌యం 09.10 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 09.12 గంటలకు బయలుదేరి, మ‌ధ్యాహ్నం 12.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.

శ్రీకాకుళం రోడ్డులో బ‌య‌లుదేరే శ్రీకాకుళం రోడ్ - నాందేడ్ స్పెషల్ (07488) రైలు ఆగ‌స్టు 15న సాయంత్రం 5.00 గంటలకు బ‌య‌లుదేరే రాత్రి 7.33 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుండి రాత్రి 7.35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మ‌ధ్యాహ్నం 3.25 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

ప్రత్యేక రైలుకు నాందేడ్ - శ్రీకాకుళం రోడ్డు మధ్య ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్న‌వ‌రం, అన‌కాప‌ల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లిలో స్టాప్‌లు ఉన్నాయి. కంపోజిషన్: ఈ రెండు రైళ్లలో 3వ ఏసీ-1, స్లీపర్ క్లాస్-21, సెకండ్ క్లాస్ లగేజ్ బ్రేక్ వ్యాన్ – 1 దాని కూర్పులో ఉంటాయి.

పొడిగించిన ప్రత్యేక రైళ్లు…

న‌ర‌సాపూర్‌-ఎస్ఎంబీటీ బెంగ‌ళూరు స్పెష‌ల్ (07153) రైలు ఆగ‌స్టు 16 నుంచి సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కు పొడిగించారు. అలాగే ఎస్ఎంబీటీ బెంగ‌ళూరు-న‌ర‌సాపూర్ స్పెష‌ల్ (07154) రైలు ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు పొడిగించారు.

సికింద్ర‌బాద్‌-రామ‌నాథ‌పురం స్పెష‌ల్ (07695) రైలు ఆగ‌స్టు 21 నుంచి సెప్టెంబ‌ర్ 25 వ‌ర‌కు పొడిగించారు. రామ‌నాథ‌పురం-సికింద్ర‌బాద్ స్పెష‌ల్ (07696) రైలు ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కు పొడిగించారు.

రైళ్ల మళ్లింపు

చెన్నై డివిజన్‌లోని చెన్నై సెంట్రల్ - బేసిన్ బ్రిడ్జ్ విభాగాల మధ్య వంతెన పునర్నిర్మాణం కోసం ట్రాఫిక్, పవర్ బ్లాక్ కారణంగా రైళ్లు దారి మళ్లింపు జ‌రుగుతోంది.

అలప్పుజా - ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352 ) రైలు ఆగ‌స్టు 29 వ‌ర‌కు కోయంబత్తూరు వద్ద పోదనూరు- ఇరుగూర్- సూరత్‌కల్ స్కిప్పింగ్ స్టాపేజ్ మీదుగా నడిపేందుకు మళ్లించబడుతుంది. ప్రయాణీకుల ప్రయోజనం కోసం పోదనూరులో అదనపు స్టాపేజ్‌లు ఏర్పాటు చేస్తారు.

గుణుపూర్-రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18118) పలాస-సంబల్‌పూర్ నగరం, విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) మధ్య పలాస వద్ద ఆగష్టు 15 నుండి రాకపోకల సమయాల్లో మార్పు చేశారు.

1. రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ గుణుపూర్‌లో మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుంది. ఇది పలాసకు సాయంత్రం 6.30 గంటలకు చేరుకుని సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరుతుంది. సోంపేట రాత్రి 7.08 గంట‌ల‌కు చేరుకుని రాత్రి 7.10 గంటలకు బ‌య‌లు దేరుతుంది. ఇచ్ఛాపురం రాత్రి 7.23 గంట‌ల‌కు చేరుకుని రాత్రి 7.25 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఇతర స్టేషన్లలో సమయాలు అలాగే ఉంటాయి.

2. పలాస స్టేషన్‌లో విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) సమయాలు సవరించారు. పలాసకు సాయంత్రం 6.43 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 6.48 గంటలకు బయలుదేరుతుంది. ఇతర స్టేషన్లలో ఈ రైలు సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు.

రైళ్ల రీషెడ్యూలింగ్/షార్ట్-టర్మినేషన్

వాల్తేర్ డివిజన్‌లోని పలాస-పుండి-నౌపడ-విజయనగరం సెక్షన్‌లో భద్రతకు సంబంధించిన ఆధునికీకరణ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్‌ల కారణంగా ఆగ‌స్టు 15, 17 రైలు సర్వీసులు ప్రభావితమవుతాయి.

భువనేశ్వర్‌లో బ‌య‌లుదేరే భువనేశ్వర్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12830) రైలు ఆగ‌స్టు 15న‌ (1గం ఆలస్యంగా) మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరడానికి బదులుగా మ‌ధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేశారు.

పూరి నుండి బ‌య‌లుదేరే పూరి - గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ (22974) రైలు ఆగ‌స్టు 17 (1.30 గంట‌ల‌ ఆలస్యంగా) ఉద‌యం 11:15 గంటలకు బయలుదేరడానికి బదులుగా మ‌ధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేయబడుతుంది.

భువనేశ్వర్ నుండి బ‌య‌లుదేరే భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (22879) రైలు ఆగ‌స్టు 17న‌ (1 గంట‌ ఆలస్యంగా) మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరడానికి బదులుగా మ‌ధ్యాహ్నం 1.10 గంటలకు షెడ్యూల్ చేశారు.

రెండు రైళ్లు షార్ట్-టర్మినేషన్

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - పలాస మెము (07470) రైలు ఆగ‌స్టు 15, 17 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌లో షార్ట్ టర్మినేట్ చేస్తారు.

పలాస - విశాఖపట్నం మెము (07471) రైలు ఆగ‌స్టు 15, 17 తేదీలలో పలాసకు బదులుగా శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరుతుంది.

కేకే లైన్‌లోని కిరండూల్ ప్రాంతంలో వర్షాల కారణంగా నాలుగు రైళ్లు షార్ట్ టర్మినేట్ అయ్యాయి.

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ స్పెష‌ల్ ప్యాసింజర్ (08551) రైలు దంతెవాడలో ఆగ‌స్టు 14 వ‌ర‌కు షార్ట్ టర్మినేట్ చేస్తారు.

కిరండూల్-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్ (08552) రైలు ఆగ‌స్టు 15 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది.

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514) రైలు దంతెవాడలో ఆగ‌స్టు 14 వ‌ర‌కు షార్ట్ టర్మినేట్ చేస్తారు.

కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు ఆగ‌స్టు 15 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి బయలుదేరుతుంది.

అందువల్ల ఆగ‌స్టు 15 వ‌ర‌కు కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్ర‌యాణాలు చేసుకోవాలి.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం