తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Edit Option: ఏపీ టెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ రెడీ.. తప్పులు సరి చేసుకోండి ఇలా..

AP TET 2024 Edit Option: ఏపీ టెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ రెడీ.. తప్పులు సరి చేసుకోండి ఇలా..

Sarath chandra.B HT Telugu

24 July 2024, 5:50 IST

google News
    • AP TET 2024 Edit Option: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. 
ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది.
ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది.

ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది.

AP TET 2024 Edit Option: ఆంధ్రప్రదేశ్‌‌లో మెగా డిఎస్సీ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు అవకాశం కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏపీ టెట్ 2024 పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకోడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది.

  • అప్లికేషన్లను ఎడిట్ చేయడానికి అభ్యర్థులు ఏపీ టెట్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి “అప్లికేషన్ డిలీట్” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ చివరలో వుండే “OTP” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అభ్యర్థి దరకాస్తు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • దాంతో మొదట అప్‌లోడ్ చేసిన అప్లికేషన్ డిలీట్ అవుతుంది. తరువాత పేపర్ చేంజ్ ఆప్షన్ కనబడుతుంది.
  • పేపర్ చేంజ్ ఆప్షన్ దగ్గర “ఎస్/Yes “ మీద క్లిక్ చేయాలి. అందులో టెట్ పేపర్ల జాబితా కనబడుతుంది.
  • అభ్యర్థి తాను మార్చుకోదలచిన పేపర్ / సబ్జెక్టును జాబితా నుంచి గుర్తించాలి.
  • రెండోసారి ఎంపిక చేసుకున్న పేపర్ / సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్హతలు , మీడియం ఇతర వివరాలు అన్నిటిని దరఖాస్తులో పూర్తి చేసి దరఖాస్తును సరి చేసుకుని తిరిగి సబ్మిట్ చేయాలి.
  • పేపర్ 2 ఏ - ఇంగ్లీష్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ పరీక్షా సమయంలో అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే 8 భాషలలో అభ్యర్థి తన ఫస్ట్ లాంగ్వేజ్ ని ఎంపిక చేసుకొని ఆ విభాగంలో వచ్చే 30 ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు .

టెట్ 2024 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సూచించారు.

టెట్ దరఖాస్తు సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

టెట్ దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు పొరపాట్లు చేయొద్దని పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పలు సూచనలు చేశారు.

• దరఖాస్తు నింపడానికి ముందుగా అభ్యర్థి ముందుగా ap tet 2024 వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in లో మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది.

• అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.

• అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, దరఖాస్తు చేస్తున్న పేపరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్, వివరాలతో పేమెంట్ గేట్ వే ద్వారా నిర్దేశిత ఫీజు చెల్లించాలి.

• అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడితో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు లోని అన్ని వివరాలను పూర్తి సమాచారంతో అప్లికేషన్‌లో నింపి పూర్తి చేసుకోవాలి.

• దరఖాస్తును ప్రివ్యూ చూసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని వివరాలు అన్నీ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి

• దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద తెలిపిన హెల్ప్ డెస్క్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. (9505619127, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9963069286, 9398810958, 9398822618)

• అదేవిధంగా అభ్యర్థులు తమ సందేహాలను కింది మెయిల్ ఐడి కి grivances.tet.@apschooledu.in మెయిల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.

• దరఖాస్తు నింపేటప్పుడు ఏవైనా తప్పులు వున్నట్లైతే అభ్యర్థులు కాండిడేట్ లాగిన్ లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకుని తిరిగి దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం