Dasara Special Trains: విజయవాడ-శ్రీకాకుళం మధ్య దసరా ప్రత్యేక రైళ్లు, నేటి నుంచి అందుబాటులోకి...
09 October 2024, 13:14 IST
- Dasara Special Trains: దసరా ప్రయాణాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
విజయవాడ-శ్రీకాకుళం మధ్య దసరా ప్రత్యేక రైళ్లు...
Dasara Special Trains: దసరా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విజయవాడ-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రతి రోజు రాత్రి 8గంటలకు నంబర్ 07215 ప్రత్యేక రైలు బయలుదేరుతుంది.
విజయవాడ నుంచి బయలుదేరు రైలు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌ను ఉదయం ఐదున్నరకు చేరుకుంటుంది. అక్టోబర్ 9, 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో నంబర్ 07216తో శ్రీకాకుళం రోడ్ - విజయవాడ ప్రత్యేక రైలుట శ్రీకాకుళంలో ఉదయం ఆరున్నరకు బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
విజయవాడ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి బయల్దేరి ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో ఏసీ త్రీ టైర్, స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీతో స్పెషల్ ట్రైన్స్ కొనసాగిస్తున్న విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.