Husband Killed wife: దారుణం.. మద్యం మత్తులో భార్యకు ఉరేసిన భర్త
16 January 2024, 14:30 IST
- Husband Killed wife: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యకు ఉరేసి హతమార్చాడు.
మద్యం మత్తులో భార్యకు ఉరేసిన భర్త
Husband Killed wife: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దారుణం జరిగింది. మండలంలోని పడాల గ్రామంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో భార్యకు ఉరేసి హత్య చేశాడు. భార్య బ్రతికుండగానే ఆమెకు ఉరేసి చంపినట్లు గుర్తించారు.
పడాల గ్రామానికి చెందిన జేమ్స్, నాగమణి దంపతులు. పిల్లలు ఆడుకునే విషయంపై సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జేమ్స్ నాగమణిపై చేయి చేసుకున్నాడు.
పిల్లలు ఆడుకునే విషయంలో తలెత్తిన వివాదంలో భార్య చెంపపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న భార్య చనిపోయిందనుకుని ఎవరికి అనుమానం రాకూడదని ఉరి వేసి వేలాడదీశాడు. భార్యను కొట్టి చంపిన నేరం తన మీదకు వస్తుందని భావించి ఆమె బ్రతికుండానే ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరివేశాడు.
ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు కొన ఊపిరితో వేలాడుతున్న నాగమణిని కిందకు దించి బ్రతికించే ప్రయత్నం చేశారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యునితో చికిత్స అందించినా అప్పటికీ మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతురాలు నాగమణి నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలోనే నిందితుడు తాడేపల్లి గూడెం రూరల్ పోలీసులు జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో చిన్నారులు అనాథలుగా మారారు. జేమ్స్ క్షణికావేశంలో చేసిన పనికి పిల్లలు తల్లిని కోల్పోయారు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకోవడం పిల్లలు దిక్కులేని వారయ్యారు.