Jagan And ChandraBabu : ఇద్దరు ఇద్దరే… ఇద్దరిలో కామన్ పాయింట్ అదే….!
23 December 2022, 13:11 IST
Jagan And ChandraBabu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏ మాత్రం పొసగదు. ఒకరంటే ఒకరికి గిట్టదు. అవకాశం దురికితే ఒకరినొకరు విమర్శించుకోడానికి ఏ మాత్రం వెనకాడరు. అయితే ఇద్దరు నాయకుల్లో ఓ పాయింట్ మాత్రం కామన్‌గా కనిపిస్తుందనేది దగ్గర నుంచి చూసిన వారు, బ్యూరోక్రసిలో ఉన్నవారు చెప్పే మాట… ఇంతకీ ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నాయకుల్లో కామన్ పాయింట్ ఏమిటంటే…..
జగన్, చంద్రబాబులో కామన్ పాయింట్ అదే
Jagan Vs ChandraBabu ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తవుతున్నాయి. మరో 14-15 నెలల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. నిన్న మొన్న అధికారంలోకి వచ్చినట్టున ప్రభుత్వం అప్పుడే మూడేళ్లు పూర్తి చేసేసుకుంది. అదే సమయంలో రాష్ట్రవిభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. చంద్రబాబు పరిపాలనా విధానానికి, జగన్మోహన్ రెడ్డి పాలనకు పూర్తి వైరుధ్యం ఉంటుంది. ఇద్దరిలో ఏ విషయంలోను పొంతన ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన చంద్రబాబు నాయుడు 83లో తెలుగుదేశం పార్టీ హవాలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి కుప్పంలో గెలుస్తూనే ఉన్నారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి 2009 ఎన్నికల్లో తొలిసారి కడప పార్లమెంటు స్థానానికి గెలుపొందారు. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరపున లోక్‌సభకు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గం పోటీ చేశారు. 2019లో కనీవిని ఎరుగని మెజార్టీని జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారు.
ఇద్దరిలో కామన్ పాయింట్ అదే…..
ముఖ్యమంత్రిలో స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతనిచ్చే విషయంలో సొంత సామాజిక వర్గాల వైపే మొగ్గు చూపుతారనే విమర్శ ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రిని నేరుగా కలవగలిగే అవకాశం ఉండేది.
చంద్రబాబు నాయుడు పాలనా హయంలో రాష్ట్ర రాజధానిని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. 2016 జూన్ నుంచి ఉద్యోగులు ఏపీకి తరలి రావడం మొదలైంది. వెలగపూడిలో సచివాలయ నిర్మాణం పూర్తైన తర్వాత చంద్రబాబు నిత్యం తన కార్యాలయానికి వచ్చేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలగపూడిలోనే ఉండేవారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒకటి రెండు సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చే వారు. సచివాలయంలో ఉన్న బ్యాక్ గ్రౌండ్‌నే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడంతో మొదట్లో జగన్ కూడా నిత్యం సచివాలయానికి వస్తున్నారని అంతా భావించే వారు. ఆ తర్వాతి కాలంలో ఆయన తన క్యాంపు కార్యాలయ ఇంటీరియర్ మార్చడంతో ఆయన ఇంటి నుంచి ఎక్కువగా పనిచేస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది.
ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు తమ సొంత సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వారు. ముఖ్యమంత్రి కార్యాలయం, పేషీల్లో తమకు అనువుగా ఉండే వారికి మాత్రమే కీలక పోస్టింగులు దక్కుతాయనే విమర్శ ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉంది. చంద్రబాబు తనపై కులం ముద్ర పడకుండా సామాజిక సమతుల్యత పాటించినట్లు పైకి కనిపించేది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో మాత్రం కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టడానికి సొంత కులం మంత్రం పనిచేసేది
సచివాలయం, సిఎం కార్యాలయాలను పక్కన పెడితే ఇతర కీలక శాఖల్లో అధికార పార్టీకి సంబంధించిన వర్గాలకు ప్రాధాన్యత దక్కేది. మూడున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కూడా ఇందుకు భిన్నంగా ఏమి సాగట్లేదు. కీలక శాఖల్లో సీనియారిటీ కంటే సొంత మనుషులకు ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడుతో జగన్ పోటీ పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారుల నియామకం విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి పేషీ, కార్యాలయం విషయాల్లో ఎలాంటి సంకోంచం ఉండట్లేదు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంలో నలుగురికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందనే ఆరోపిస్తున్నా, నిజానికి ఆ విషయంలో ఆద్యుడు ఆయనే. 2016-19 మధ్య కాలంలో సచివాలయంలో ముఖ్యమంత్రి కొలువు దీరే ఫస్ట్ బ్లాక్‌లోకి ఇతరుల ప్రవేశం నిషిద్ధంగా ఉండేది. ఈ విషయంలో మీడియా సర్కిల్స్‌లో చాలా చలోక్తులు కూడా ఉండేవి. సిఎం ఉండే బ్లాకులోకి అందరికి ఎంట్రీ కష్టమనే అపవాదు ఉండేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎవరికి ఎంట్రీ లేకుండా పోయింది. అది నిషిద్ధ ప్రదేశంగా మారిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం, వివరణలు కోరే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. కాకపోతే సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం అనే విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవరికి వారే సాటి అని మాత్రం
టాపిక్