తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Vahanamithra: నేడు వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల

YSR Vahanamithra: నేడు వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల

HT Telugu Desk HT Telugu

29 September 2023, 6:13 IST

google News
    • YSR Vahanamithra: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండీయూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరాలకు అండగా నిలిచే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదు విడత నిధులు నేడు విడుదల చేయనున్నారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

YSR Vahanamithra: ఏపీలో డ్రైవర్లకు నేడు వాహన మిత్ర నిధులు విడుదల కానున్నాయి. విజయవాడ భవానీపురంలో జరిగే కార్యక్రమంలో డ్రైవర్లకు వాహన మిత్ర నిధులను సిఎం జగన్ బదిలీ చేస్తారు.

సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండీయూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరాలకు అండగా నిలిచే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఐదు విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు.

లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నా, తమ బతుకు బండి లాగడానికి మాత్రం ఇబ్బంది పడుతున్న డ్రైవర్లకు బాసటగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.

వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా నేడు అందిస్తున్న రూ. 275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం సాయం 1,301.89 కోట్లు అందించింది. ఒక్కొక్కరికి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 50 నెలల్లో రూ. 50,000 చెల్లించినట్టైంది.

"ఎండీయూ ఆపరేటర్లు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ఉంటూ వారు సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు, వారి వాహనాలను మంచి కండిషన్లో ఉంచుకునేందుకు.. వారు క్షేమంగా ఉంటూ, వారిని నమ్ముకున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

“వైఎస్సార్ వాహన మిత్ర" పథకానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది వాహన మిత్ర అందుకునే లబ్ధిదారుల్లో వర్గాల వారీగా, 2023-24 సంవత్సరానికి – ఎస్సీలు 67,513, ఎస్టీలు 11,497, బీసీలు 1,51,271, మైనార్టీలు (ముస్లిం, క్రిస్టియన్లు) 5,100, కాపు 25,046, ఇతరులు 15,504 ఉన్నారు. మొత్తం 2,75,931 మందికి వాహన మిత్ర ద్వారా ఆర్ధిక సాయం అందనుంది.

తదుపరి వ్యాసం